Guntur Kaaram Trailer
‘గుంటూరు కారం’ ఘాటెంతో ట్రైలర్‌తో చూపించాడు త్రివిక్రమ్. ఈ సినిమా నుంచి ఇప్పటి వరకూ వచ్చిన కంటెంట్ పై డివైడ్ టాక్ వినిపించింది. ఇప్పుడు ఈ ట్రైలర్ తో అందరి అంచనాల్నీ అందుకొన్నాడు. ఈనెల 12న గుంటూరు కారం విడుదల అవుతోంది. నిన్న రావాల్సిన ట్రైలర్… ఈ రోజు విడుదల చేశారు. ట్రైలర్లో మహేష్ స్వాగ్, త్రివిక్రమ్ డైలాగ్స్, ఆ విజువల్స్.. ఇవన్నీ అదరగొట్టేశాయనే చెప్పాలి. ముఖ్యంగా మహేష్ డైలాగ్ డెలివరీ, మేనరిజం కొత్తగా ఉన్నాయి. ట్రైలర్ అంతా.. మహేష్ మానియా కనిపించింది. బీడీ వెలిగించే స్టైల్.. మాస్‌ని మురిపించడం ఖాయం. ట్రైలర్‌ని ఎమోషనల్ యాంగిల్ తో.. త్రివిక్రమ్ వాయిస్ ఓవర్ తో మొదలెట్టి… ఆ తరవాత ప్రతీ షాట్ కీ ఓ హై ఇచ్చుకొంటూ వెళ్లారు. తమన్ ఎప్పటిలా ఆర్.ఆర్తో.. మోత మోగించాడు. శ్రీలీల అనగానే డాన్సులు గుర్తొస్తాయి. ఈ సినిమాలోనూ అందుకు లోటు ఉండదనిపిస్తోంది. మరీ ముఖ్యంగా త్రివిక్రమ్ డైలాగులు మెరిశాయి..
మీరు మీ పెద్దబ్బాయిని అనాథలా వదిలేశారని అంటున్నారు… దానికి మీరేం చెబుతారు?
చూడంగానే మజా వచ్చిందా? హార్ట్ బీట్ పెరిగిందా? ఈలేయాలనించిందా?
చింపేసుకొంటారా? వేసుకొని చింపుతారా? ఎంత చింపాలో, ఎక్కడ కనిపించాలో… ఆ యవ్వారమే వేరండీ!
కోడ్తే… పెళ్లాం ముందు ఉంచుకొన్నదాని పేరు చెప్పేయాలా…
ఈడు రౌడీ రమణ.. సినిమా స్కోపు.. 70 ఎం.ఎం
ఆడొక బ్రేకుల్లేని లారీ.. ఎవడాపుతాడు
గుంటూరు కారం.. ఎర్రగా ఘాటుగా కనిపిస్తాది. ఒక్కసారి నాలిక్కి తగిలిందంటే.. కళ్లల్లో వచ్చేది నీళ్లే.
ఎప్పుడో చిన్పప్పుడు కొట్టాల్సిన అమ్మ.. ఇప్పుడు పిలిపించీ ఇస్త్రీ చీర కట్టుకొని మరీ కొడతాందీ..
రమణగాడు.. నీ లైఫ్ ఒక మెరాలిక్రా బాబూ..
– ఇవన్నీ.. ట్రైలర్లో వినిపించిన డైలాగులు. సినిమాలో ఇంకెన్ని దాచారో. మొత్తానికి ఈ పండక్కి మాస్ మీల్స్ ఇవ్వడానికి మహేష్ రెడీ అయిపోయాడు. ఇక ఆస్వాదించడం, ఆనందించడం ఫ్యాన్స్ వంతు.