నేషనల్ అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ ప్రవీణ్‌సత్తారు దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘గుంటూర్ టాకీస్’ ఈ చిత్రంలో సిద్ధు జొన్నగడ్డ, నరేష్ విజయ్‌కృష్ణ, రేష్మీ గౌతమ్, శ్రద్ధాదాస్, లక్ష్మీ మంచు, మహేష్ మంజ్రేకర్ ప్రధాన తారాగణంగా నటించారు. ఆర్.కె.స్టూడియోస్ బ్యానర్‌పై రాజ్‌కుమార్.ఎం ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఫిభ్రవరి 3న ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్స్ ను నటసింహ నందమూరి బాలకృష్ణ చేతుల మీదుగా విడుదల చేయనున్నారు. ఈ సందర్భంగా…
దర్శకుడు ప్రవీణ్ సత్తారు మాట్లాడుతూ ‘‘చందమామ కథలు సినిమా తర్వాత చేస్తున్న సినిమా ఇది. నేషనల్ అవార్డ్ సినిమా తర్వాత చేస్తున్న సినిమా కావడంతో నాపై బాధ్యత పెరిగింది. రామ్కుమార్గారు సినిమాని ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా నిర్మించారు. నేను చేస్తున్న సినిమాల్లో సామాజిక స్పృహ ఉన్నట్లు ఈ సినిమాలో సామాజిక స్పృహతో పాటు సినిమా అవుటండ్ అవుట్ కామెడితో ఫాస్ట్ పేజ్‌లో ఉంటుంది. ప్రతి పాత్ర నవ్విస్తుంటుంది. మహేష్ మంజ్రేకర్గారు విలన్‌గా నటిస్తున్నారు. థియేట్రికల్ ట్రైలర్ ను ఫిభ్రవరి 3న నందమూరి బాలకృష్ణగారు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాు జరుగుతున్నాయి. త్వరలోనే ప్రేక్షకుల ముందుకు వస్తాం’’ అన్నారు.
నిర్మాత రాజ్‌కుమార్.ఎం మాట్లాడుతూ ‘‘నేషనల్ అవార్డ్ విన్నర్ ప్రవీణ్ సత్తార్గారితో కలిసి పనిచేయడం ఆనందంగా ఉంది. ఫస్ట్ ఫ్రేమ్ నుండి లాస్ట్ ఫ్రేమ్ వరకు సినిమా కామెడితో సాగుతుంది. జబర్దస్త్ ప్రోగ్రామ్‌తో ఫేమస్ అయిన రేష్మీ గౌతమ్ ఈ సినిమాలో మెయిన్ లీడ్ చేస్తుంది. ఆమెను హీరోయిన్గా, సిద్ధుని హీరోగా పరిచయం చేస్తున్నాం. సినిమా 90శాతం హిందూపురం మరియు పరిసర ప్రాంతాల్లో చిత్రీకరణ జరుపుకుంది. షూటింగ్ జరిగినన్ని రోజులు హిందుపూర్ ప్రజలు సహకారం మరువలేనిది. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఫిభ్రవరి 3న థియేట్రికల్ ట్రైలర్ ను నందమూరి బాలకృష్ణ గారు విడుదల చేస్తున్నారు. ఆయన అందిస్తున్న సపోర్ట్ కు ఆయనకు స్పెషల్ థాంక్స్. త్వరలోనే ఆడియో విడుదల చేసి, సినిమాను విడుదల చేస్తాం’’ అన్నారు.
సిద్ధు జొన్నలగడ్డ, రష్మి గౌతమ్, నరేష్, శ్రద్ధాదాస్, రాజా రవీంద్ర, రఘుబాబు, రవిప్రకాష్, అపూర్వ, ఫిష్ వెంకట్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: రామిరెడ్డి, ఎడిటర్: ధర్మేంద్ర, మ్యూజిక్: శ్రీ చరణ్ పాకల, నిర్మాత: రాజ్ కుమార్.ఎం., కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: ప్రవీణ్ సత్తారు.