తెలుగులోనూ అడల్ట్ కామెడీ సినిమాలు ఆడతాయ్.. అని చెప్పిన సినిమా గుంటూర్ టాకీస్. బూతుని వేరే రేంజులో చూపించి సొమ్ము చేసుకొన్న సినిమా ఇది. ప్రవీణ్ సత్తారు ఇలాంటి సినిమాలు కూడా తీస్తాడా?? అని ఆశ్చర్యపోయేలా చేసిందీ సినిమా. రూపాయి పెట్టి సినిమా తీస్తే ఐదు రూపాయలు లాభం వచ్చింది. అందుకే ఇప్పుడు ఈ సినిమాకి సీక్వెల్ తీయడానికి రెడీ అయిపోయారు. గుంటూర్ టాకీస్ 2 త్వరలోనే సెట్స్‌పైకి వెళ్లబోతోంది. గుంటూర్ టాకీస్ లో నటించిన నటీనటులే ఈ సినిమాలోనూ కనిపించనున్నారు. అయితే.. కథ వేరేలా మొదలవ్వబోతోంది. కథ విషయంలో పార్ట్ 1కీ పార్ట్ 2కీ ఎలాంటి సంబంధమూ ఉండదని తెలుస్తోంది.
ప్రవీణ్ సత్తారు ఇప్పుడు రాజశేఖర్‌తో ఓ సినిమా చేస్తున్నాడు. అదయ్యాకే.. పార్ట్ 2 మొదలవ్వొచ్చు. ఒకవేళ పార్ట్ 2కి ప్రవీణ్ కాకుండా వేరే దర్శకుడు వచ్చినా ఆశ్చర్యపోనవసరం లేదు. ఎందుకంటే ఈ సినిమాని కొనసాగించాలన్నది పూర్తిగా నిర్మాతల డిసీజన్ అని తెలుస్తోంది. ప్రవీణ్ ఉంటాడా? లేడా?? అన్నది ఇంకా తెలియాల్సివుంది. ఒకవేళ పార్ట్ 2కూడా బాగా ఆడితే… బూతు సినిమాల తాకిడి తెలుగు నాట మరింత ఎక్కువ అవుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.