పెంట్ హౌస్ అంటే మనకు తెలిసింది వేరు.. బడా లగ్జరీ అపార్టుమెంట్లలో పెంట్ హౌస్. అల్ట్రా లగ్జరీ అపార్టుమెంట్లలో పెంట్ హౌస్ అంటే ప్యాలెస్. ఇలాంటి ప్యాలెస్ లాంటి పెంట్ హౌస్ ను రూ. 190 కోట్లకు అమ్మేశారు. రిషి పార్తీ అనే టెక్ కంపెనీ యజమాని కొనుగోలు చేశారు. గురుగ్రామ్‌లోని డీఎల్ఎఫ్ కామెలియాస్ లో 16,290 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ అల్ట్రా-లగ్జరీ పెంట్‌హౌస్ ఉంది.
అసలు ఈ అపార్టుమెంటే అత్యంత లగ్జరీ నిర్మాణం. ఇక్కడ కనీస ఒక్క ఫ్లాట్ వంద కోట్లతో స్టార్ట్ అవుతుంది. గోల్ఫ్ కోర్స్ రోడ్‌పై ఉన్న ఈ ప్రాజెక్ట్ డీఎల్ఎఫ్ గోల్ఫ్ అండ్ కంట్రీ క్లబ్‌కు సమీపంలో ఉంది. 17.5 ఎకరాల విస్తీర్ణంలో 9 టవర్లు నిర్మించారు. మొత్తం 429 యూనిట్లు మాత్రమే ఉంటాయి. ఒక్కో ఫ్లాట్ సైజ్ 7,400 చదరపు అడుగుల నుండి 16,290 చదరపు అడుగుల వరకు ఉంటుంది. క్లబ్‌హౌస్, స్విమ్మింగ్ పూల్, జిమ్, స్పా, గోల్ఫ్ కోర్స్ యాక్సెస్, 24/7 సెక్యూరిటీ వంటి అత్యాధునిక సౌకర్యాలు ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. ఇది భారతదేశంలో మొట్టమొదటి LEED ప్లాటినం సర్టిఫైడ్ రెసిడెన్షియల్ ప్రాజెక్ట్
డీఎల్ఎఫ్ కామెలియాస్ లో ప్రముఖ వ్యాపారవేత్తలు, స్టార్టప్ వ్యవస్థాపకులు, రాజకీయ నాయకులు, సెలబ్రిటీలు ఫ్లాట్లు కొనుగోలు చేశారు. ఇక్కడ ఇల్లుఉండటం ఒక హోదా , లగ్జరీ లైఫ్ స్టైల్ కోసం అన్నట్లుగా ఉంది. అందుకే .. ఇక్కడ వందకోట్లు పెట్టి ఇల్లు కొనడం అనేది కామన్‌గా మారింది.