కాంగ్రెస్ లోకి వెళ్లే జాబితాలో తానున్నానంటూ.. శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి సంకేతాలు పంపుతున్నారు. రేవంత్ పాలన బాగుందని ప్రజలు మెచ్చుకుంటున్నారని ప్రకటించేశారు. చాలా వేగంగా అసంతృప్తి పెరిగిందని బీఆర్ఎస్ నేతలు ప్రచారం చేస్తూంటే .. గుత్తా మాత్రం రివరర్స్ లో స్పందించారు. అంతేనా రేవంత్ రడ్డి తనకు బంధువని చెప్పుకుంటున్నారు.
బీఆర్ఎస్ నల్లగొండ ఎంపీ అభ్యర్థిత్వం కోసం గుత్తా ప్రయత్నించారు.కానీ జగదీష్ రెడ్డి ఒప్పుకోలేదు. భువనగిరి ఇచ్చేందుకు కేసీఆర్ సిద్ధమయ్యారు. కానీ గుత్తానే వద్దనుకున్నారు. నాయకత్వంపై విశ్వాసం లేకనే బీఆర్ఎస్ పార్టీ నుంచి వలసలు కొనసాగుతున్నాయని కేసీఆర్ పై క్యాడర్ నమ్మకం కోల్పోయారని చెప్పకనే చెబుతున్నారు ఇప్పటికే కాంగ్రెస్ నాయకత్వం నుంచి గుత్తాకు, ఆయన కుమారుడికి రాజకీయ భవిష్యత్‌కు స్పష్టమైన హామీ ఇచ్చిందన్నప్రచారం జరుగుతోంది.
అయితే మండలిలో బీఆర్ఎస్ కే మెజార్టీ ఉంది. ఆయన పార్టీ మారితే అవిశ్వాసం పెట్టే అవకాశం ఉంది. కానీ ఇప్పటికే పలువురు ఎమ్మెల్సీలు కాంగ్రెస్ లో చేరారు. మరికొంత మందిని ఆకర్షిస్తే గుత్తా పదవి నిలబడుతుంది. ఇప్పుడు గుత్తా ఏనిర్ణయం తీసుకుంటారో తేలాల్సి ఉంది. తాను బీఆర్ఎస్ లో ఉన్నా కాంగ్రెస్ కే లోక్ సభ ఎన్నికల్లో మద్దతిస్తానని చెప్పకనే చెబుతున్నారు.