ఈ రోజుల్లో మ్యూజిక్ డైరెక్టర్ గా వంద సినిమాలు చేయడం మామూలు విషయం కాదు. రెండు ఫ్లాపులు పడగానే మసకబారిపోయే జమానా ఇది. ఇలాంటి కాలంలో వంద సినిమాల క్లబ్ లో చేరడం రేర్ ఫీట్. అందులోనూ యాక్టర్ గా సినిమాలు చేస్తూనే మ్యూజిక్ డైరెక్టర్ వంద సినిమాలు ఫినిష్ చేయడం గ్రేట్ ఫీట్. ఆ ఫీట్ ని అందుకున్నాడు జీవి ప్రకాష్ కుమార్.
ఏఆర్ రెహమన్ మేనల్లుడిగా పరిచయమైన జివి తక్కువ కాలంలోనే పెద్ద ప్రాజెక్ట్స్ చేస్తూ చాలా సూపర్ హిట్లు ఇచ్చాడు. రెహ్మాన్, హరీష్, యువన్, దేవిశ్రీ, తమన్, అనిరుద్.. ఇలా అందరూ ఫాంలో వున్న టైంలోనే స్వరకల్పన చేసి తనకంటూ ఒక స్టయిల్ ని క్రియేట్ చేసుకున్నారు. ఆయన మ్యూజిక్ చేసిన దాదాపు సినిమాల్లో ఎదో ఒక హిట్ సాంగ్ వుండేలా చూసుకున్నారు. జివి సక్సెస్ రేట్ కూడా ఎక్కువే. ఈ దీపావళికి వచ్చిన అమరన్, లక్కీ భాస్కర్ సినిమాలకి తనే మ్యూజిక్.
ఈ నెల 14న ఆయన మ్యూజిక్ ఇచ్చిన మట్కా సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. దిని తర్వాత నితిన్ రాబిన్ హుడ్ సినిమాకి ఆయనే మ్యూజిక్. జివి వందో సినిమా కూడా ఫిక్స్ అయ్యింది. సుధా కొంగర దర్శకత్వంలో రాబోతున్న సినిమాతో జీవి 100 క్లబ్ లో చేరుతున్నారు.
యాక్టింగ్, మ్యూజిక్ .. రెండిని ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారనే ప్రశ్న ఆయన్ని అడిగితే.. ‘నెలలో 12 రోజులే షూటింగ్. మిగతా సమయం అంతా కీబోర్డ్ ముందే వుంటాను. లాస్ట్ మినిట్ వరకూ వర్క్ చేయకూడదనే రూల్ పెట్టుకున్నాను. దాని ప్రకారమే సినిమాలు ఒప్పుకుంటాను. రిలీజ్ కి వారం ముందుగానే నా టేబుల్ నుంచి సినిమా వెళ్లిపోతుంది. బహుసా అందుకే దర్శక నిర్మాతలు నాతో పని చేయడానికి ఇష్టపడతారు’ అని చెప్పుకొచ్చారు జివి.