దేవిశ్రీ ప్రసాద్, తమన్ హవాలో అప్పుడప్పుడూ అనిరుథ్, జీవి.ప్రకాష్ కుమార్ పేర్లు కూడా మెరుస్తున్నాయి. తాజాగా వరుణ్ సందేశ్ ‘మట్కా’ కోసం సంగీత దర్శకుడిగా జీవి.ప్రకాష్ కుమార్‌ని ఎంచుకొన్నారు. చిత్రబృందం ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది. ‘పలాస’తో ఆకట్టుకొన్న కరుణ కుమార్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇటీవలే… సెట్స్‌పైకి వెళ్లింది. వైరా మూవీస్ సంస్థ ఈ చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో నిర్మిస్తోంది. నోరా ఫతేరీ, మీనాక్షి చౌదరి కథానాయికలుగా నటిస్తున్నారు.
జీవి.ప్రకాష్ కుమార్ తమిళంలో బిజీగా ఉన్నాడు. ఓవైపు హీరోగా, మరో వైపు సంగీత దర్శకుడిగా క్షణం కూడా ఖాళీ ఉండదు. అందుకే కథల ఎంపికలో ఆచి తూచి స్పందిస్తుంటారు. ఇటీవల విడుదలైన ‘టైగర్ నాగేశ్వరరావు’కి ఆయనే సంగీతం అందించారు. పాటలు అంత గొప్పగా లేవు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ విషయంలో తన మార్క్ చూపించాడు. జీవి ని ఎంచుకోవడానికి కారణం అదే. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో సన్నివేశాల్ని బాగా ఎలివేట్ చేస్తాడు. ‘మట్కా’కు కావల్సింది కూడా అదే.