సంగీత దర్శకుడిగా కెరియర్ స్టార్ట్ చేసిన జీవి ప్రకాశ్ సడెన్ గా హీరో అవ్వాలనే ఆలోచన ఎందుకు వచ్చిందో ఏమో వరుసెంట సినిమాలు తీస్తూ హిట్లు అందుకుంటున్నాడు. కోలీవుడ్లో రీసెంట్ గా వచ్చిన త్రిష ఇల్లానా నయనతారా సినిమాలో మనోడు వీర ప్రతాపం చూపించి తంబీలను ఆకట్టుకున్నాడు. చిన్న బడ్జెట్ సినిమానే అయినా కాసుల వర్షం బాగానే కురిపించాడట. ఇదే ఊపుమీద మరో రెండు సినిమాలు లైన్లో పెట్టాడు. ఫుల్ ఫాంలో దూసుకెళ్తున్న జీవి ప్రకాశ్ కన్నునాని సినిమాపై పడ్డదట.
రీసెంట్ గా నానికి బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన భలే భలే మగాడివోయ్ సినిమ రీమేక్ రైట్స్ ని సొంతం చేసుకునే ఆలోచనలో ఉన్నాడట జీవి ప్రకాశ్. ఆల్రెడీ ఈ సినిమా రీమేక్ హక్కులు తమిళ నిర్మాతలు తీసుకున్నారు. అయితే వారితో మంతనాలు జరిపి ఆ సినిమాలో తాను నటించడానికి ప్రయత్నాలు చేస్తున్నాడట ఈ రెహమాన్ మేనళ్లుడు. మాంచి స్పీడ్ మీదున్న ఈ కుర్రాడు అంతే స్పీడ్ గా సినిమాల మీద సినిమాలు చేసేస్తున్నాడు.
నాని, లావణ్య త్రిపాటి లీడ్స్ రోల్స్ లో నటించిన భలే భలే మగాడివోయ్ సినిమా ఓవర్సీస్లో కూడా మాంచి కలెక్షన్స్ ని సాధించింది. కేవలం 6 కోట్లతో నిర్మించబడ్డ ఈ సినిమా దాదాపు 50 కోట్ల కలెక్షన్స్ ని తెచ్చిపెట్టింది. నాని మతిమరుపు నటన ప్రేక్షకులందరిని ఆకట్టుకుంది. మరి తమిళంలో ఈ సినిమాను ట్రై చేస్తున్న జీవి ప్రకాశ్ కూడా భలే మగాడు అనిపించుకుంటాడో లేడో చూద్దాం.