ఫైబర్ నెట్ చైర్మన్ కు.. టీడీపీకి రాజీనామా చేసిన జీవీ రెడ్డి బడ్జెట్ సూపర్ అంటూ ఓ ట్వీట్ పెట్టారు. తక్కువ రెవిన్యూ లోటుతో ప్రణాళికాబద్ధంగా రూపొందించారని ప్రశంసించారు. ఆర్థిక వ్యవహారాలపై జీవీ రెడ్డికి పట్టు ఉంది.
ఇదే ట్వీట్ లో చంద్రబాబును జీవీ రెడ్డి పొగిడారు. రాజకీయాలకు దూరంగా ఉన్నప్పటికీ చంద్రబాబు నాయకత్వం పట్ల నాకు ఎప్పటికీ గౌరవం, అభిమానం ఉంటుందన్నారు. టీడీపీ లోనూ, ప్రభుత్వ వ్యవస్థలోనూ నాకు గౌరవప్రదమైన బాధ్యతలు అప్పగించడం మర్చిపోలేనన్నారు. ఎప్పటికీ రుణపడి ఉంటానన్నారు. 2029లో కూడా చంద్రబాబు ముఖ్యమంత్రి అవ్వాలని కోరుకున్నారు.
జీవీ రెడ్డిపై టీడీపీ నేతల్లో సానుభూతి ఉంది. ఆయన కొంత మంది ట్రాప్ లో పడి ఆవేశ పడ్డారని..కాస్త సానుకూలంగా ఆలోచించి ఉంటే.. ఇలాంటి పరిస్థితి వచ్చేది కాదన్న అభిప్రాయం ఉంది. ఆయన నిబద్ధత విషయంలో ఎవరికీ సందేహం లేదు కానీ.. దూకుడుగా ఉంటూ ఆయన తీసుకున్న కొన్ని నిర్ణయాల వల్లే పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. కొన్నాళ్లు సైలెంటుగా ఉండి తర్వాత పార్టీలో యాక్టివ్ అయితే సరిపోయేది కానీ ఆవేశంగా పార్టీకి కూడా రాజీనామా నిర్ణయం తీసుకున్నారు. అయితే ఆయన ట్వీట్ ను బట్టి చూస్తే .. మళ్లీ పార్టీలో యాక్టివ్ అయ్యే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నారు.