ఇటీవలి కాలంలో ఏపీ బీజేపీ నేత జీవీఎల్ తాను కాపు ఉద్దారకుడ్ని అని ప్రచారం చేసుకుంటున్నారు. సన్మానాలు కూడా చేయించుకోవడం.. కాపుల కోసం తాను ఎంత దూరమైనా వెళ్తానన్నట్లుగా ప్రకటనలు యడం కామెడీగా మారింది. అదే సమయంలో ఆయన పార్లమెంట్లో ఓ జిల్లాకు రంగా పేరు పెట్టాలని కోరారు. ఆయన తీరు చూసి.. కాపు నేతలు కూడా కొత్త బిచ్చగాడొచ్చాడని సెటైర్లు వేసుకుంటున్నారు. అసలు జీవీఎల్ కాపుల కోసం ఏం చేశారో చెప్పాలని కన్నా లక్ష్మినారాయణ వేసిన ప్రశ్నకు ఇంత వరకూ సమాధానం లేదు.
జీవీఎల్ నరసింహారావుకు అసలు కాపు సామాజికవర్గానికి సంబంధం లేదు. అంతగా బీజేపీకి కాపు సామాజికవర్గాన్ని దగ్గర చేసుకోవాలంటే.. ఆ వర్గం నేతల్ని ప్రోత్సహిస్తే ప్రయోజనం ఉండేది.. సోము వీర్రాజును ముందు పెట్టినా కాస్త ప్రయోజనం ఉండేది. కానీ ఆయనను కూడా పక్కన పెట్టి జీవీఎల్ తాను ఏదో కాపు ఉద్దారకుడ్ని అన్నట్లుగా ప్రచారం చేసుకుంటున్నారు. ఇది బీజేపీలోనే కాదు కాపు సామాజికవర్గంలోనూ విస్తృత చర్చకు కారణం అవుతోంది. అసలు జీవీఎల్ ఎవరు.. ఆయన కాపు నేత ఎలా అవుతారన్నదే ఆ చర్చ.
కన్నా రాజీనామా చేస్తారని క్లారిటీ వచ్చిన తర్వాత కూడా జీవీఎల్లే తెర ముందుకు వచ్చారు. ఏపీలో బీజేపీ ఎంతగా క్లూ లెస్ గా ఉందో.. కొంత మంది రాజకీయ నేతల గుప్పిట్లో ఎలా ఇరుక్కుపోయిందో.. జీవీఎల్ చేస్తున్న కాపు రాజకీయమే నిరూపిస్తుందన్న సెటైర్లు పడుతున్నాయి. పోటీ చేస్తే కనీస ఓట్లు కూడా తెచ్చుకోలేని నేతలు బీజేపీని నడపడం వల్లే ఈ సమస్య వస్తోందని అంటున్నారు.