భారతీయ జనతా పార్టీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు… ఏపీలో జరుగుతున్న ఐటీ దాడుల విషయంలో.. రాజకీయ ప్రమేయం ఏమీ లేదని చెప్పుకోవడానికి… తంటాలు పడుతున్నారు. ఈ విషయంలో సీఎం రమేష్ ఓ రకంగా సంచలన ఆరోపణలు చేశారు. మదన్ అనే ఐటీ అధికారి.. ప్రవీణ్ కుమార్ అనే మరో ఐటీ అధికారి పేర్లు చెప్పి మరీ… ఆరోపణలు చేశారు. వారు పార్టీ మారాలని.. బెదిరింపులకు దిగారని బయటపెట్టారు. కేవలం భయభ్రాంతులకు గురి చేయడానికి… దుష్ప్రచారం చేయడానికే…ఐటీ సోదాలు చేస్తున్నారని కొన్ని సాక్ష్యాలు బయపెట్టారు. మూడు రోజుల పాటు.. సీఎం రమేష్ ఇళ్లు, బంధువుల ఇళ్లు, కార్యాలయాల్లో సోదాలు చేసి… దేవుడికి ముడుపులుగా పెట్టిన డబ్బులు మాత్రమే తీసుకెళ్లారని… ఐటీ వాళ్లిచ్చిన పంచనామా పత్రాలను కూడా బయటపెట్టారు. ఈ విషయం.. దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ అయింది.
అంతలోనే ఐటీ అధికారుల్ని వెనకేసుకు వచ్చేందుకు జీవీఎల్ నరసింహారావు.. ముందుకు వచ్చారు. ఐటీ అధికారులపై ఈగ వాలకుండా… తన వాదన వినిపించడం ప్రారంభించారు. ఓ టీవీ చానల్ చర్చలో… అడ్డదిడ్డమైన సమాధానాలతో.. కాలం వెలిబుచ్చారు. సీఎం రమేష్ భార్య పేరుతో నోటీసులను ఐటీ అధికారులు తీసుకు వచ్చారు. కానీ తన భార్య ఏ కంపెనీలోనూ డైరక్టర్‌గా లేదని.. గృహిణిగా ఉన్న ఆమె పేరుతో.. నోటీసులు తీసుకు రావడంతోనే కుట్ర ఏమిటో స్పష్టమయిందని సీఎం రమేష్ తన వాదనను బలంగా వినిపిస్తే.. జీవీఎల్ మాత్రం. ఎప్పుడో పదిహేనేళ్ల కిందట.. ఇరవై ఏళ్ల కిందట… ఆమె సీఎం రమేష్ కంపెనీల్లో డైరక్టర్ గా ఉన్నారని చెప్పుకొచ్చారు. అక్కడా సీఎం రమేష్ సవాల్ చేశారు…నిరూపించాలని. కానీ జీవీఎల్ మరో అడ్డదిడ్డమైన ఆరోపణ వైపు వెళ్లారు కానీ.. స్పందించలేదు.
ఏపీలో జరిగిన కచ్చితంగా రాజకీయ ప్రేరేపిత దాడులన్న విషయం… ప్రజల్లోకి వెళ్లిపోయింది. కేవలం టీడీపీ నేతలను టార్గెట్ చేసి ఐటీ దాడులు ఎందుకు జరుగుతున్నాయో.. ప్రశ్నిస్తే భయపడుతున్నారని… ఎదురుదాడి చేయడం ఎందుకో జీవీఎల్‌కు తెలియకుండా ఉంటుందని ఎవరూ అనుకోలేరు. కానీ జీవీఎల్ మాత్రమే.. ఎందుకిలా.. ఐటీ అధికారులను డిఫెండ్ చేస్తున్నారన్న అంశం.. టీడీపీ వర్గాల్లో విస్తృతంగా చర్చనీయాంశమవుతోంది. తనే.. స్వయంగా.. ఎవరెవరి ఇళ్లలో ఐటీ సోదాలు చేయించాలి..? ఎవరిని టార్గెట్ చేయాలి..? అన్న స్కెచ్ గీస్తున్నారా..? అన్న అనుమానాలు సహజంగానే వస్తున్నాయి. ఆయన చేతలతో అదే నిజమని నిరూపిస్తున్నారు. గతంలో.. ఇలా జరుగుతుందని.. ఆయన ఏపీకి వచ్చి హెచ్చరించిన సందర్భాలను కూడా టీడీపీ నేతలు గుర్తు చేస్తున్నారు.