భారతీయ జనతా పార్టీ ఎంపీ, అధికార ప్రతినిధి జీవీఎల్ నరసింహారావు .. ఇటీవలి కాలంలో తిరుమల వివాదంపై… ఎక్కువగా స్పందిస్తున్నారు. కారణమేమిటో తెలియదు కానీ.. బీజేపీ తరపున ఇప్పుడు ఈ ఇష్యూలో ఆయన వకాల్తా పుచ్చుకున్నారు. అయితే ఆయన మద్దతు .. శ్రీవారికి, ఆలయ ప్రతిష్టకు సంబంధించి.. కాకుండా.. పూర్తిగా రమణ దీక్షితుల వరకే ఉంటోంది. ఆయనకు ప్రొత్సహం ఇస్తున్నట్లుగా ఉంది. వాస్తవానికి ప్రస్తుత తిరుమల వివాదం మొత్తం… బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా తిరుమల వచ్చి.. రమణదీక్షితులతో సమావేశం అయిన తర్వాతే ప్రారంభమైంది. ఇప్పుడు జీవీఎల్ ఆ ఎపిసోడ్‌ను తన సూచనలతో ముందుకు తీసుకెళ్తున్నట్లు తాజా పరిణామాలున్నాయి.
శ్రీవారి ఆలయ ప్రతిష్టలకు సంబంధించిన అంశం కావడంతో.. ఉన్న పళంగా… టీటీడీ రమణదీక్షితులకు… రిటైర్మెంట్ ఇచ్చేసింది. అప్పుడు కూడా… జీవీఎల్… పూర్తిగా రమణదీక్షితుల వైపే నిలబడ్డారు. ఆయనకు రిటైర్మెంట్ ఇవ్వడాన్ని తీవ్రంగా తప్పు పట్టారు. కానీ ఆయన చేస్తున్న ఆరోపణలను తనకు కావాల్సినట్లుగా మార్చుకుని.. ప్రభుత్వ ప్రభుత్వంపై నిందలేసినట్లుగా మాట్లాడారు. నిజానికి… రమణ దీక్షితులు చేసిన ఎన్నో ఆరోపణలకు… సంబంధించి పలు కమిటీల నివేదికలు బయటకు వచ్చాయి. రమణదీక్షితులు చెబుతున్న గులాబీ రంగు రూబీ, డైమండ్‌కు సంబంధించిన వివాదం.. ఆయన ప్రధాన అర్చకులుగా సేవలో ఉన్నప్పుడు.. వైఎస్ సీఎంగా ఉన్నప్పుడు.. భూమన కరణాకర్ రెడ్డి టీటీడీ చైర్మన్ గా ఉన్నప్పుడే జరిగింది. అయినా అదేదో ప్రస్తుత ప్రభుత్వం చేసినట్లుగా జీవీఎల్ ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు.
అదే సమయంలో.. రమణదీక్షితులపై ఎన్నో వివాదాలు బయటకు వచ్చాయి. చివరికి ఓ భక్తులు.. శ్రీవారికి ఇచ్చిన రూ.5 లక్షల విరాళాన్ని కూడా రమణదీక్షితులు సొంత అకౌంట్లో వేసుకున్న విషయం బట్టబయలైంది. కానీ ప్రభుత్వాలు.. శ్రీవారి ప్రతిష్టకు భంగం కలుగుతుందన్న ఉద్దేశంతోనే ఇంత కాలం.. రమణదీక్షితులపై చూసీ చూడనట్లు వ్యవహరించాయి. ఈ విషయలపై జీవీఎల్ కానీ.. బీజేపీ నేతలు కానీ స్పందించడం లేదు. కానీ ఆయన మాత్రం శ్రీవారిని రాజకీయంగా ఉపయోగించుకునేందుకు బీజేపీకి చాన్సిచ్చేశారు. అందుకే మంత్రి సోమిరెడ్డి.. రమణదీక్షితులపై ఘాటైన వ్యాఖ్యలే చేశారు. రమరణ దీక్షితులను జైల్లో పెట్టి విచారరిస్తే.. మొత్తం కుట్ర బయటకు వస్తుందని చెప్పేశారు. దీంతో.. జీవీఎల్ ఉన్న పళంగా స్పందించారు. ప్రభుత్వం బెదిరిస్తోందంటూ ఖండించారు. రమణ దీక్షితులకు పూర్తి సపోర్ట్‌గా నిలిచారు. ఒక వేళ నిజాలు బయటకు వస్తే.. అతి తన మెడకు.. బీజేపీ మెడకు చుట్టుకుంటుందేమో అని జీవీఎల్ భయపడుతున్నారని.. అందుకే అలా ట్వీట్లు పెడుతున్నారని టీడీపీ నేతలు ఆరోపణలు ప్రారంభించారు. తిరుమల ఎసిపోడ్‌లో.. జీవీఎల్ బీజేపీ తరపున లీడ్ తీసుకున్నట్లే కనిపిస్తోందన్న అంచనాలు రాజకీయవర్గాల్లో వచ్చేశాయి.