జీవీఎల్ నరసింహారావు ఫ్యాన్స్ ఆవేదన చెందుతున్నారు . ఈ విషయాన్ని ఆయనే చెప్పారు. తనకు టిక్కెట్ రాకపోవడం వల్ల అనేక మంది ఫోన్లు చేసి ఆవేదన చెందుతున్నారని.. తన ఆవేదనను ప్రత్యేకంగా వ్యక్తం చేశారు. గత మూడేళ్లుగా విశాఖకు నిస్వార్థమైన సేవ చేశానని అంటున్నారు. అయినా సరే నిరాశపడేది లేదని త్వరలో బీజేపీ జెండాను ఎగరేస్తానని చెప్పుకొచ్చారు.
జీవీఎల్ నరసింహారావు విశాఖకు మూడేళ్లుగా నిస్వార్థంగా సేవ చేశానని చెబుతున్నారు. ఏం సేవ చేశారో మాత్రం ఎవరికీ తెలియదు. ఇటీవల సంక్రాంతి సంబరాలు పేరుతో కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల సీఎస్ఆర్ ఫండ్స్ తో సంబరాలు చేసుకున్నారు. అది మాత్రమే ఆయన చేసిన సేవ. వారాంతాల్లో విశాఖకు వచ్చి ప్రెస్ మీట్లు పెట్టడం మినహా ఆయన చేసిన రాజకీయం ఏదీ లేదు. పార్లమెంట్ సమావేశాలు జరిగినప్పుడు ఓ ప్రశ్న అడిగి.. దానికి సమాధానం పట్టుకుని వచ్చిన… ప్రెస్ మీట్ పెట్టేవారు. ఇలాంటి రాజకీయాలు చాలా చేశారుకానీ.. విశాఖకు ఓ మెట్రో కానీ.. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిలిపివేయడం కానీ.. మరో కేంద్ర ప్రాజెక్టు కానీ తీసుకు రాలేదు.
పైగా జీవీఎల్ వైసీపీ తో కుమ్మక్కయి.. రాజధానిపై విషం చిమ్మారు. రాజధానిపై కేంద్రానికి సంబంధం లేదని రాష్ట్ర నిర్ణయమని పదే పదే వాదించారు. వైసీపీ లైన్ లో ఆయన పని చేస్తూ ఉంటారు. ఇప్పటికీ వైసీపీ అనుకూల మీడియా ఆయకు సపోర్టు చేస్తుంది. టిక్కెట్ ఇవ్వకుండా అన్యాయం చేశారని రాస్తూ ఉంటుంది. ఆయనకు టిక్కెట్ ఇస్తే ఎలా ఉండేదో కానీ.. ఇప్పుడు మాత్రం జీవీఎల్‌కు చాలా ఆవేదన అవుతోంది.