గత పార్లమెంట్ సమావేశాల్లో జీవీఎల్ ఏపీ ఐటీ ఎగుమతుల గురించి కేంద్రాన్నిప్రశ్నించారు. అప్పుడు కేంద్రం సమాధానం ఇచ్చింది. మొత్తంగా వెయ్యి కోట్లు కూడా లేవని.. ఒడిషా కంటే వెనుబడిపోయిందని సమాధానం వచ్చింది. దాన్ని పట్టుకుని ఏపీ ప్రభుత్వంపై టీడీపీ ఎంత దాడి చేయాలో అంత చేసింది. ప్రశ్న- సమాధానం తనిప్పించినవే కాబట్టి జీవీఎల్ కూడా విశాఖలో ప్రెస్ మీట్ పెట్టి… ఏపీ ఐటీ ఎగుమతులు పెరగడం లేదని చెప్పుకొచ్చారు. అది అయిపోయిన ఎపిసోడ్. అయితే మళ్లీ ఆయన పార్లమెంట్లో అదే ప్రశ్న అడిగి.. అదే సమాధానం చెప్పింది.
2021-22లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి జరిగిన ఐటీ ఎగుమతుల విలువ కేవలం రూ.926 కోట్లు మాత్రమేనని కేంద్ర ప్రభుత్వం మరోసారి వెల్లడించింది. విశాఖపట్నం ఐటీ హబ్‌గా అభివృద్ధి చెందడానికి ఉన్న అవకాశాలపై రాజ్యసభ ఎంపీ జీవీఎల్ నరసింహారావు అడిగిన ప్రశ్నకు బుధవారం కేంద్ర ఎలక్ట్రానిక్స్-ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ సమాధానమిచ్చారు. భారతదేశం నుంచి జరిగిన ఐటీ ఎగుమతుల్లో ఇది కేవలం 0.14 శాతం మాత్రమేనన్నారు. గత ఐదేళ్లలో ఐటీ ఎగుమతుల్లో ఏపీ వాటా 0.2శాతం కంటే తక్కువగానే ఉందని ఆయన స్పష్టం చేశారు.
జీవీఎల్ పదే పదే ఈ ప్రశ్న ఎందుకు అడుగుతున్నారని వైసీపీ నేతలు కూడా అసహనికి గురవుతున్నారు. ఐటీ పరిశ్రమ వైసీపీ ప్రభుత్వం వచ్చాక పూర్తిగా చితికిపోయింది. గత ప్రభుత్వం ఎంతో కష్టపడి తీసుకు వచ్చిన కంపెనీలు వెళ్లిపోయాయి. ఐటీ హబ్‌గా మారేందుకు అవకాశం ఉన్న వైజాగ్ ను చెరబట్టారు. మిలీనియం సెంటర్ నుంచి ఐటీ కంపెనీలను పంపేశారు. స్టార్టప్ విలేజ్ ను పనికి రాకుండా చేశారు. ఇలా చెప్పుకుంటూ పోతే దారుణాలు చాలా ఉన్నాయి. ఇక ఐటీ ఎగుమతులు … ప్రతి ఆరు నెలలలు ఎలా పెరుగుతాయని జీవీఎల్ అనుకుంటున్నారో ?