రాజకీయాల్లో వ్యక్తిగత దాడుల్ని అందరూ ఖండిస్తారు. చేసిన పార్టీ మాత్రం సమర్థించుకోవడానికి ప్రయత్నిస్తుంది. అది కూడా… తమ మీదకు రాకుండా.. ప్రజలు చేశారని.. ప్రజల మీద తోసేస్తుంది. ఇతర పార్టీల నేతలు స్పందించరు.. స్పందించినా.. అలాంటివి కరెక్ట్ కాదంటారు… జీవీఎల్ నరసింహారావు అనే బీజేపీ అధికార ప్రతినిధి మాత్రం.. వైసీపీ నేతలు చేసింది కరెక్టే అన్నట్లుగా… ఢిల్లీ నుంచి ఏపీకి వచ్చి మరీ ప్రెస్‌మీట్ పెట్టి చెప్పేశారు. ఇలాంటి సంస్కృతి టీడీపీనే మొదలు పెట్టిందంటూ.. విమర్శలు గుప్పించారు. చంద్రబాబు ఐదేళ్ల పాలనలో ఇంత కంటే.. ఎక్కువే జరిగాయన్నారు. ఐదేళ్ల కాలంలో.. నాలుగేళ్ల పాటు.. బీజేపీతో పొత్తులో చంద్రబాబు ఉన్నారు. టీడీపీ – బీజీపీ కలిసి పని చేశాయి. బీజేపీ నేతలు రాజ్యసభ సీటు తీసుకున్నారు.
ప్యాకేజీ ఇచ్చినందుకు సన్మానాలు కూడా చేయించుకున్నారు. ఎప్పుడు అలాంటిదాడులు జరిగాయో.. ఎవరికీ తెలియదు కానీ..జీవీఎల్.. వైసీపీని ససమర్థించడానికి జనరలైజ్ చేసేశారు. సాధారణంగా జీవీఎల్ వారాంతాల్లో మాత్రమే… ఏపీకి వస్తారు. కానీ.. వైజాగ్‌లో చంద్రబాబును అడ్డుకున్న ఘటన జరిగిన వెంటనే.. ఏపీకి వచ్చి ప్రెస్‌మీట్ పెట్టి.. వైసీపీకి పెద్దగా డ్యామేజ్ కాకుండా చేసేందుకు.. గతంలో టీడీపీ కూడా అలా చేసిందని చెప్పేందుకు ప్రాధాన్యం ఇచ్చారు. జీవీఎల్ … స్పందన చూసిన… మీడియా ప్రతినిధులు కూడా.. ఆశ్చర్యపోవాల్సి వచ్చింది. వైసీపీ కోసం… బీజేపీ నేత ప్రెస్‌మీట్ పెట్టినట్లుగా ఉందని చెప్పుకున్నారు. జీవీఎల్ తీరు కొన్నాళ్లుగా అంతే ఉంది.
మిగతా నేతలంతా ఓ వైపు ఉంటే… ఆయన మాత్రం.. వైసీపీకి హార్డ్ కోర్ ఫ్యాన్‌గా కనిపిస్తున్నారు. ఆయన వైసీపీ దగ్గర ప్యాకేజీ తీసుకున్నారని.. టీడీపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. అయినా ఆయన మాత్రం వెనక్కి తగ్గడం లేదు. వైసీపీకి అవసరమైనప్పుడల్లా ఏపీకి వచ్చి ప్రెస్మీట్లు పెడుతున్నారు.