మలయాళ చిత్రం అయ్యప్పనుమ్ కోషియుమ్ తెలుగులో రాబోతోంది. హీరోలెవరన్నది ఇంకా ఫిక్స్ కాలేదు గానీ ఈ సినిమాని హారిక హాసిని సంస్థ రూపొందించనుంది. ఓ కథానాయకుడిగా రానా ఫిక్సయిపోయాడు. రానా ఎప్పుడైతే ఈ కథలోకి ఎంట్రీ ఇచ్చాడో, అప్పుడే ఈ సినిమాలో సురేష్ ప్రొడక్షన్స్ సంస్థ కూడా వాటా తీసుకుందని సమాచారం. ప్రస్తుతం సురేష్ ప్రొడక్షన్స్ ఆధ్వర్యంలోనే అయ్యప్పనుమ్ కోషియమ్ని తెలుగీకరించబోతున్నారని టాక్. ఈ రీమేక్‌లో నందమూరి బాలకృష్ణ నటిస్తారని ముందు నుంచీ ప్రచారం జరుగుతోంది. అయితే బాలయ్య ఎంట్రీపై అటు సురేష్‌ప్రొడక్షన్స్ గానీ, ఇటు హారిక హాసిని గానీ స్పందించడం లేదు. బాలయ్యకు ఈ కథ సూటవుతుందా, లేదా? అనే విషయంపై ఇప్పుడు తర్జన భర్జనలు జరుగుతున్నాయి. స్క్రిప్టు తొలి వెర్షన్ పూర్తయ్యాకే.. ఈ విషయంపై ఓ స్పష్టత వస్తుంది. అయితే ఈ సినిమాకి దర్శకుడు ఎవరన్నది కూడా ఇంకా ఖాయం కాలేదు. ఈ కథని బాగా డీల్ చేయగలిగే దర్శకుడి కోసం అటు సురేష్ ప్రొడక్షన్స్, ఇటు హారిక హాసిని అన్వేషిస్తున్నాయి.