చంద్రబాబు అమరావతి పర్యటనకు వెళ్తే ఇతర ప్రాంతాల నుంచి మనుషుల్ని తెప్పించి ఆయన బస్సుపై రాళ్ల దాడి చేశారు. ఆ సమయంలో డీజీపీగా సవాంగ్ .. అది ప్రజాస్వామ్య భావ్యక్తీకరణ అని తేల్చారు. ఇప్పుడు అలాంటి పరిస్థితి పదవిలో ఉండగానే జగన్ రెడ్డికి ఎదురయింది. కాకపోతే పొలిటికల్ మోటివేషన్ తో కాకుండా కడుపు మండిన దివ్యాంగుడు ఆ పని చేశాడు. గుట్టుగా ఉంచిన ఆ వ్యవహారం ఇప్పుడు సంచలనంగా మారుతోంది.
జగన్ రెడ్డి క్రిస్మస్ కోసం సొంతూరికి వెళ్లారు. ఆయన సమయంలో సింహాద్రిపురం మండలం లో పర్యటిస్తున్నప్పుడు ఓ వ్యక్తి రాయి విసిరాడు. ఆ రాయి ఇంటలిజెన్స్ పోలీసుల కారును తాకింది. వెంటనే రాయి విసిరిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. రెండు రోజుల పాటు హింసించారు. ఆ వ్యక్తి దివ్యాంగుడు. పెన్షన్ కోసం ఎన్నేళ్లుగా తిరుగుతున్నా రావడం లేదు. దీంతో జగన్ రెడ్డిపై కోపం వచ్చి రాయి విసిరాడు. దీన్ని సవాంగ్ చెప్పినట్లుగా ప్రజాస్వామ్య భావ వ్యక్తీకరణ అని అనుకుండా ఆ దివ్యాంగుడిపై ప్రతాపం చూపారు.
చివరికి వైసీపీ నేతలే చొరవ తీసుకుని ఆ దివ్యాంగుడ్ని విడిచి పెట్టేలా చూసుకున్నారు. ఆ దివ్యాంగుడు జగన్ రెడ్డి అభిమానే. వైసీపీకే పని చేస్తారు. కానీ అర్హత ఉన్నా పెన్షన్ రానందువల్ల.. కసి పెంచుకుని రాయితో కొట్టారు. ఈ తరహా వ్యతిరేకత ను చూసే మొదటి ముఖ్యమంత్రి జగన్ రెడ్డికావొచ్చన్న సెటైర్లు పులివెందులలో గట్టిగా వినిపిస్తున్నాయి.