మంగళగరి నియోజకవర్గాన్ని మౌలిక సదుపాయాల పరంగా అభివృద్ధి చేయడమే కాదు.. ప్రజల్ని ఆర్థికంగా ఉన్నత స్థానానికి వెళ్లేలా చేయడానికి మంత్రి, ఎమ్మెల్యే నారా లోకేష్ వినూత్నమైన ప్రయత్నాలు చేస్తున్నారు. మంగళగిరి ప్రజలు ప్రధానంగా వ్యవసాయం, చేనేత, గోల్డ్ స్మిత్ పని మీద ఆధారపడి ఉంటారు. వ్యవసాయం కోసం ప్రభుత్వ పరంగా చేయాల్సినవి చేస్తున్నారు. చేనేత, గోల్డ్ స్మిత్ ల కు ప్రభుత్వ పరంగా చేయడంతో పాటు వారికి మెరుగైన శిక్షణ ఇప్పించడం, మార్కెటింగ్ అవకాశాలు కల్పించడం కోసం వ్యక్తిగతంగా కూడా ఖర్చు పెట్టుకుని ప్రయత్నిస్తున్నారు.
మంగళగిరి సమీపంలో అతి పెద్ద చేనేత పార్క్ ను నిర్మించాలని తలపెట్టారు. మెగా హ్యాండ్లూమ్ పార్కు కోసం లోకేష్ చాలా రోజులుగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. దాదాపుగా చివరి స్టేజ్ కు వచ్చాయి. అలాగే ఇప్పుడు స్వర్ణకారుల కోసం కూడా జ్యూవలరీ పార్క్ ను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఇది అతిపెద్దగా ఉండేలా.. శిక్షణ, ఉపాధి లభించేలా చేసేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఇందు కోసం గోల్డ్ స్మిత్ లందరూ ఏకతాటిపైకి వచ్చేలా చేస్తున్నారు.
మంగళగిరి ప్రజల్ని ఆర్థికంగా అభివృద్ధి చేయడానికి అక్కడి చేనేతలకు ఎక్కువ పని వచ్చేలా చేయడానికి ఇప్పటికే టాటా బ్రాండ్ తనేరియా వంటి షోరూమ్‌లలో వస్త్రాలు అమ్మకానికి పెడుతున్నారు. ఇంకాపెద్ద పెద్ద బ్రాండ్లలోనూ అందుబాటులో ఉంచుతున్నారు. ఇపుడు స్వర్ణకారులు కూడాతమ ప్రతిభను ప్రదర్శించుకునే.. మార్కెటింగ్ చేసుకునే అవకాశం కల్పిస్తే వారు దూసుకెళ్తారు. మంగళగిరి పేరు మార్మోగిపోతుంది. లోకేష్‌కు కావాల్సింది కూడా అదే.