ఛైల్డ్ ఆర్టిస్ట్‌గా కెరీర్‌ని స్టార్ట్ చేసి ఓ అరడజను సినిమాల్లో నటించిన హన్సిక ‘దేశముదురు’ చిత్రంతో హీరోయిన్గా పరిచయమైంది. ఈ చిత్రానికి బెస్ట్ డెబ్యూ ఆర్టిస్ట్‌గా ఫిలింఫేర్ అవార్డును కూడా అందుకుంది. ఆ తర్వాత ఎన్నో సినిమాల్లో తన అందంతో, అభినయంతో ఆకట్టుకున్న హన్సిక లేటెస్ట్గా చేసిన ‘అరణ్మయి2’ చిత్రం రిలీజ్‌కి సిద్ధంగా వుంది. మనిషే కాదు ఆమె మనసు కూడ అందమైనదేనని ఆమె చేస్తున్న వివిధ సేవా కార్యక్రమాల ద్వారా తెలుస్తోంది. చదువుకునే స్తోమతలేని 25 మంది పిల్లలని దత్తత తీసుకొని తన వంతు సాయం అందిస్తోంది. తన ప్రతి పుట్టినరోజున ఒక అనాధని దత్తత తీసుకుంటోంది. ముంబైలో వారి కోసం ఓ ఆశ్రమం కూడా కట్టించి అందరికీ ఆదర్శంగా నిలుస్తోంది హన్సిక. అలాగే బ్రెస్ట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న 10 మంది మహిళలకు వైద్య సహాయాన్ని అందిస్తోంది. బ్రెస్ట్ క్యాన్సర్ అవేర్నెస్ కోసం స్థాపించిన ‘చెన్నయ్ టర్న్స్ పింక్’ సంస్థకి హన్సిక బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తోంది.
హన్సిక అంటే ఒక హీరోయిన్ మాత్రమే కాదు, మంచి చిత్రకారిణి కూడా. ఆమెకు చిన్నతనం నుంచీ చిత్రలేఖనం అంటే ప్రాణం. అలా చిన్నతనం నుంచి హన్సిక వేసిన చిత్రాలు చాలానే వున్నాయట. ఇప్పుడు వాటన్నింటినీ వేలం వేయబోతోంది హన్సిక. ఈ వేలం ద్వారా వచ్చే డబ్బును అనాధాశ్రమాలకు అందించబోతోంది. తనకు ఖాళీ దొరికినప్పుడల్లా బొమ్మలు వేయడంలోనో, తను దత్తత తీసుకున్న అనాధ పిల్లలతో గడపడం ద్వారా అంతులేని ఆనందాన్ని పొందుతుందట. హన్సికను ఇప్పటివరకు ఒక గ్లామర్ హీరోయిన్‌గానే చూసిన ప్రేక్షకులు ఇప్పుడు ఆమెలో దాగి వున్న మానవతావాదిని చూసి అభినందించకుండా వుండలేకపోతున్నారు.