ఒక్క టీజర్‌తోనే అందరి దృష్టినీ తన వైపునకు తిప్పుకొంది ‘హనుమాన్’. ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహిస్తున్న సినిమా ఇది. హనుమాన్ గా… తేజా సజ్జా కనిపించనున్నాడు. మేలో రావాల్సిన సినిమా ఇది. వీఎఫ్ఎక్స్ వల్ల ఆలస్యమైంది. ఇప్పుడు ఈ సినిమా సంక్రాంతికి షిఫ్ట్ అయ్యింది. జనవరి 12న ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నట్టు చిత్ర బృందం ప్రకటించింది.
సంక్రాంతి సీజన్ కి తిరుగులేదు. యావరేజ్ మార్కులు పడ్డా.. వసూళ్ల వర్షం కురుస్తుంది. అయితే.. సంక్రాంతి సీజన్ లో చాలా టఫ్ కాంపీటీషన్ ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఎందుకంటే సంక్రాంతికి పెద్ద సినిమాల హవా ఎక్కువ. ప్రాజెక్ట్ కె సంక్రాంతికే వస్తోంది. దాంతో పాటు `గుంటూరు కారం` కూడా ఈ సీజన్లోనే తీసుకురావాలనుకొంటున్నారు. కనీసం 3 పెద్ద సినిమాలు ఈ సీజన్ కోసం పోటీ పడబోతున్నాయి. వాటితో పాటు హనుమాన్ కూడా చేరింది. హనుమాన్ పై మంచి అంచనాలే ఉన్నాయి. దసరా టైమ్ లో.. హనుమాన్ వస్తే బాగుండేది. కానీ వీఎఫ్ఎక్స్ కోసం మరింత ఎక్కువ సమయం తీసుకోవాలని భావించిన దర్శక నిర్మాతలు సంక్రాంతికే మెగ్గు చూపించారు. మేలో రావాల్సిన సినిమా. ఏకంగా 8 నెలలు ఆగిందంటే.. వీఎఫ్ఎక్స్ కోసం ఎంత శ్రమిస్తున్నారో, ఎంత టైమ్ తీసుకొంటున్నారో అర్థం చేసుకోవొచ్చు.