అఖిల్ – హను రాఘవపూడి కాంబినేషన్లో ఓ సినిమా పట్టాలెక్కాల్సింది. అన్నీ అనుకొన్నట్టు జరిగితే.. ఈపాటికి సినిమా మొదలైపోయేదే. కానీ అనివార్య కారణాల వల్ల ఈ కాంబినేషన్లో సినిమా ఆగిపోయింది. ఇప్పుడు హను.. నితిన్ జట్టు కట్టాడు. అఖిల్ ఎప్పట్లా దర్శకుడి కోసం ఎదురుచూపులు చూస్తున్నాడు. అఖిల్ కోసం రాసుకొన్న కథే నితిన్‌తో చేస్తున్నాడన్న టాక్ కూడా వినిపిచింది. అయితే… ఇప్పుడు ఈ కథకో ట్విస్ట్ వచ్చింది. అఖిల్ – హను రాఘవపూడి కాంబినేషన్లో సినిమా ఉందట. 2017లో ఈ సినిమా పట్టాలెక్కే ఛాన్సుందని తెలుస్తోంది. అఖిల్ కోసం రాసుకొన్న కథ అలానే ఉందని, నితిన్ కోసం వేరే కథ సిద్ధం చేశాడని చెబుతున్నారు.
అంటే… నితిన్ సినిమా అవ్వగానే అఖిల్ తో సినిమా మొదలవుతుందని చెబుతున్నారు. హను ఇప్పటికీ అఖిల్‌కి టచ్‌లోనే ఉన్నాడని… ఈ కాంబినేషన్లో సినిమా ఖాయమని టాలీవుడ్ సమచారం. సెప్టెంబరులో నితిన్‌తో సినిమా మొదలెట్టి 2017 ఫిబ్రవరిలో ఈ చిత్రాన్ని విడుదల చేసే అవకాశాలున్నాయని తెలుస్తోంది. అంటే అఖిల్ మూడో సినిమా కచ్చితంగా హను రాఘవపూడితోనే అన్నమాట.