అందాల రాక్షసితో ఆకట్టుకొన్నాడు హను రాఘవపూడి. అయితే.. తొలి విజయం మాత్రం నాని సినిమా కృష్ణగాడి వీర ప్రేమగాథతోనే దక్కింది. ఆ వెంటనే అఖిల్ తో సినిమా చేయాల్సింది. అంతా ఓకే అనుకొన్న తరవాత.. అఖిల్ ఎందుకో డ్రాప్ అయ్యాడు. అఖిల్‌కి ఓ హిట్టు అత్యవసరమైన పరిస్థితిలో ప్రయోగాలు చేయడానికి ఇష్టపడని నాగార్జున.. హను రాఘవపూడి సబ్జెక్ట్‌ని హోల్డ్ లో పెట్టాడు. హను డ్రాప్ అవ్వడంతో అఖిల్ – విక్రమ్ కె.కుమార్ల ప్రాజెక్ట్ సెట్టయ్యింది. అయితే అదే కథని నితిన్‌తో `లై`గా సెట్ చేశాడని వార్తలొచ్చాయి. వీటిపై హను స్పందించాడు. ”ఆ కథ వేరు.. ఇది వేరు. అఖిల్ కోసం ఆ కథ అలానే ఉంది. అఖిల్ నుంచి ఎప్పుడు పిలుపొచ్చినా చేయడానికి సిద్థంగా ఉన్నా” అని క్లారిటీ ఇచ్చాడు హను. అఖిల్‌కీ ఈ కథ వదులుకోవడం ఇష్టం లేదు. అందుకే… హనుని హోల్ట్‌లో పెట్టాడు. ‘లై’ కనుక హిట్టయితే… అఖిల్ నుంచి హనుకి మరోసారి పిలుపు రావడం ఖాయం. అప్పుడు మాత్రం నాగార్జున కాదనలేడు కదా? హను కోసం యంగ్ హీరోలంతా ఎదురుచూస్తున్నారు. కొంతమంది హీరోలు ‘లై’ రిపోర్ట్ ఎలాఉన్నా.. మాతో సినిమా చేయ్ అని అప్పుడే కర్చీఫ్ వేసేసినట్టు సమాచారం. అయితే.. హను మాత్రం ‘లై’ రిజల్ట్ తరవాతే మాట ఇస్తానని అంటున్నాడట.