సీతారామంతో ఫామ్లోకి వచ్చేశాడు హను రాఘవపూడి. ఈ సినిమా కేవలం విజయాన్ని మాత్రమే అందించలేదు. దర్శకుడిగా హను గౌరవాన్ని కూడా పెంచింది. సీతారామం తరవాత హను ఎలాంటి సినిమా చేయబోతున్నాడు? ఎవరితో చేస్తాడు? ఈసారి ఎలాంటి జోనర్ ఎంచుకోబోతున్నాడు? అనే విషయాలపై మరింత ఆసక్తి పెరిగింది.
హను మైత్రీ మూవీస్ కోసం ఓ సినిమా చేస్తున్నాడు. ప్రస్తుతం కథ రెడీ అవుతోంది. ఇది కూడా సీతారామం లానే ఓ పిరియాడికల్ డ్రామా. అయితే ఈసారి ఇందులో ఇద్దరు హీరోలు ఉంటారట. ఇది హను డ్రీమ్ ప్రాజెక్ట్ లాంటిదని తెలుస్తోంది. ఈ కథ చేయాలన్న ఆలోచన హనుకి ఎప్పటి నుంచో ఉంది. కానీ… ఓ మంచి హిట్టు కొట్టి, నమ్మకాన్ని సంపాదించి, అప్పుడు తన కలల సినిమా తీయాలనుకొన్నాడు. ఇప్పుడు ఆ అవకాశం వచ్చింది. అయితే ఆ ఇద్దరు హీరోలు ఎవరో తెలియాలి. బహుశా శర్వానంద్, నాని… లాంటి హీరోలే ఉండొచ్చు. మరో నెల రోజుల్లో హను తదుపరి సినిమాపై పూర్తి క్లారిటీ వచ్చేస్తుంది.