ఈమధ్య స్టార్ హీరోల సినిమాలు గమనిస్తే వారు కూడా కథ కథనాల మీదే ఎక్కువ దృష్టి పెట్టారని అర్ధమవుతుంది. తమ ఇమేజ్ తో సినిమా ఆడటం లాంటివి కాకుండా తమ ఇమేజ్ కు తగ్గ కథతో ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయడానికి సిద్ధమవుతున్నారు. అందుకే ఎప్పుడు లేని విధంగా ఇన్నాళ్లు క్లాస్ లుక్ తో ఉన్న హీరోలు మాస్ లుక్ లో.. ఎప్పుడు మాస్ లుక్ తో ఆడియెన్స్ కు దగ్గరైన వారు క్లాస్ లుక్ తో రకరకాల సినిమాలు చేస్తున్నారు.
మహేష్ లాంటి స్టార్ హీరో శ్రీమంతుడు లాంటి కాన్సెప్ట్ ఓరియెంటెడ్ సినిమా తీయడం దీనికి ఉదాహరణ.. ఇంకా యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ కూడా తన స్టైలిష్ యాక్షన్ తో నాన్నకు ప్రేమతో అంటూ ఓ కూల్ రివెంజ్ స్టోరీని తీశాడు. సో ఇలా తమని తాము తమ పాత్రల ద్వారా ప్రేక్షకుల్లో వెళ్లే ప్రయత్నాలు చేస్తున్నారు హీరోలు. ఇప్పుడు అదే విధంగా తారక్ అందాల రాక్షసి, కృష్ణగాడి వీర ప్రేమగాధ సినిమాలతో హిట్ కొట్టిన దర్శకుడు హను రాఘవపూడితో ఓ సినిమాకు సిద్ధమయ్యాడు. ఆ సినిమా సబ్జెక్ట్ ఓ రొమాంటిక్ లవ్ స్టోరీ అని తెలుస్తుంది. మొన్నటిదాకా కత్తులు కొడవళ్లు పట్టిన జూనియర్ ఇప్పుడు సరికొత్త పంథాలో సినిమాలు చేయడం విశేషం. ఇక పాత్ర ఏదైనా తను చేశాడంటే అదరగొట్టేస్తాడనుకోండి.
సో మొత్తానికి అలా తారక్ ఓ లవ్ స్టోరీతో మన ముందుకు రాబోతున్నాడన్నమాట. హను రాఘవపూడి దర్శకత్వంలో ఎన్.టి.ఆర్ ను మనం లవర్ బోయ్ గా చూసే లక్ కలిగింది. మరి ఈ క్రేజీ కాంబో ఎప్పుడు సినిమా స్టార్ట్ అవుతుందో చూడాలి.