‘ఆర్‌.ఆర్‌.ఆర్‌’ చూపిన బాట‌లో `హ‌నుమాన్‌`

ఈ సంక్రాంతికి విడుద‌లైన ‘హ‌నుమాన్‌’ క‌నీవినీ ఎరుగ‌ని విజ‌యాన్ని అందుకొంది. చిన్న సినిమాల్లో అతి పెద్ద విజ‌య‌మిది. సంక్రాంతికి విడుద‌లైన బ‌డా సినిమాల్ని బెంబెలెత్తించింది. ‘హ‌నుమాన్‌’ ఇప్పుడు 50 రోజుల మార్క్‌ని దాటింది. ఇప్పుడు సీక్వెల్ పై క‌న్నేశాడు ప్ర‌శాంత్ వ‌ర్మ‌. ఇప్ప‌టికే ‘జై హ‌నుమాన్’ ప‌నులు ప్రారంభించిన‌ట్టు త్వ‌ర‌లోనే ఫ‌స్ట్ లుక్ విడుద‌ల చేయ‌బోతున్న‌ట్టు అప్ డేట్ ఇచ్చాడు. ‘హ‌నుమాన్’ సినిమా అంతా ఒక ఎత్తు. చివ‌రి 20 నిమిషాలూ మ‌రో ఎత్తు. ఆ చివ‌రి 20 నిమిషాలూ ఎలా ఉందో, ‘జై హ‌నుమాన్’ సినిమా మొత్తం అలా ఉండ‌బోతోంద‌ని ప్ర‌శాంత్ చెబుతున్నాడు. ‘హ‌నుమాన్’ గా ఎవ‌రు క‌నిపిస్తార‌న్న విష‌యంలో మాత్రం ఇప్ప‌టి వ‌ర‌కూ ఎలాంటి క్లారిటీ రాలేదు. ఈ సీక్వెల్ లో న‌టించ‌డానికి బాలీవుడ్ స్టార్లు సైతం ఆస‌క్తి చూపిస్తున్నారు. టీ సిరీస్ సంస్థ నిర్మాణ భాగ‌స్వామిగా ఉండ‌బోతోంద‌ని వార్త‌లొస్తున్నాయి. వీటిపై కూడా ఓ క్లారిటీ రాబోతోంది.

‘హ‌నుమాన్’ సినిమాని అంత‌ర్జాతీయ చిత్రోత్స‌వాల‌కు పంప‌బోతోంది టీమ్‌. ఇప్ప‌టికే కొన్ని ఫిల్మ్ ఫెస్టివ‌ల్స్‌కి ఈ చిత్రాన్ని పంపారు. ప్ర‌తిష్టాత్మ‌క చ‌ల‌న చిత్రోత్స‌వాల్లో ‘హ‌నుమాన్‌’ని నిల‌పాల‌ని, అక్క‌డ అవార్డులు కొల్ల‌గొట్టాల‌ని ప్ర‌శాంత్ వ‌ర్మ భావిస్తున్నాడు. ఇందుకు సంబంధించిన ఓ టీమ్ గ‌ట్టిగా క‌స‌ర‌త్తు చేస్తోంది. ‘ఆర్‌.ఆర్‌.ఆర్‌’ చిత్రాన్ని ఆస్కార్‌, గ్రామి అవార్డుల బ‌రిలో నిలిపిన త‌ర‌వాత‌, ఇండియ‌న్ సినిమాల‌కు ఓ రూట్ దొరికింది. ఆ దారిలోనే ప్ర‌శాంత్ వ‌ర్మ హ‌నుమాన్ చిత్రానికి అవార్డుల పంట పండించాల‌ని గ‌ట్టిగా ప్ర‌య‌త్నిస్తున్నాడు. అవార్డుల ప‌రంగానూ ‘హ‌నుమాన్’ కొత్త చ‌రిత్ర సృష్టించే అవ‌కాశాలు పుష్క‌లంగా ఉన్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

డి-ఏజింగ్… లాభమా? నష్టమా ?

సినిమాలో ఒక క్యారెక్టర్ బాల్యం, యవ్వనం, కౌమార, ప్రౌడ దశలని చూపించడం ఫిల్మ్ మేకర్స్ కి పెద్ద సవాల్. ఇందుకోసం హలీవుడ్ నుంచి కూడా మేకప్ మ్యాన్ లని దిగుమతి చేసుకునే వారు....

దువ్వాడ శ్రీనివాస్ ఇంట్లో దివ్వెల మాధురీ !

దువ్వాడ ఫ్యామిలీ డ్రామాలో కొత్త కొత్త ఎపిసోడ్లు ప్రారంభమవుతున్నాయి. కొద్ది రోజుల పాటు సైలెంట్ గా ఉంటానని చెప్పిన దివ్వెల మాధురీ.. ఒక్క సారిగా.. ఏకంగా దువ్వాడ శ్రీనివాస్ ఇంట్లోనే ప్రత్యక్షమయ్యారు. దువ్వాడ...

ఆ పడవలు నందిగం సురేష్ తాలూకానే !

ప్రకాశం బ్యారేజీకి వరద వస్తే ఈ మధ్య బోట్లు కొట్టుకు వస్తున్నాయి. బ్యారేజని డ్యామేజ్ చేస్తున్నాయి. అవి ఎలా వస్తున్నాయో తెలియడం లేదు. ఇప్పుడు మిస్టరీ బయటపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. వైసీపీ రంగులేసిన...

శభాష్ నిమ్మల… అభినందించిన నారా లోకేష్

భారీ వర్షానికి తోడు బుడమేరకు పడిన గండ్లు విజయవాడను ముంచేత్తాయి. కనీవినీ ఎరుగని స్థాయిలో వరద పోటెత్తడంతో విజయవాడ గత ఆరు రోజులుగా వరదలో నానుతోంది. బుడమేరుకు పడిన గండ్లు పూడ్చితేనే విజయవాడకు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close