అమరావతిని పట్టాలెక్కించడానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. టెండర్లు ఖరారు చేశారు. ప్రముఖ సంస్థలు కాంట్రాక్టులు దక్కించుకున్నాయి. హ్యాపీనెస్ట్ ప్రాజెక్టుపై అందరి దృష్టి ఉంది. ఆ ప్రాజెక్టును నాగార్జున కన్ స్ట్రక్షన్ కంపెనీ దక్కించుకుంది. శరవేగంగా పూర్తి చేసే లక్ష్యంతో ఈ కంపెనీ పనులు ప్రారభించనుంది.
హ్యాపీనెస్ట్ అనేది సీఆర్డీఏ ప్రాజెక్ట్. అమరావతి నుంచి నిధుల సంపాదించుకునే క్రమంలో సీఆర్డీఏ ఈ ప్రాజెక్టు రూపకల్పన చేసి.. విక్రయించింది. బుకింగ్స్ ప్రారభించిన గంటలోనే అన్ని ఫ్లాట్లు అమ్ముడుపోయి.. ఇంకా డిమాండ్ తో వెబ్ సైట్ కూడా క్రాష్ అయ్యేంత క్రేజ్ ఈ ప్రాజెక్టుకు వచ్చింది.కానీ జగన్ అమరావతి నిర్మాణంతో పాటు ఈ ప్రాజెక్టును కూడా నిలిపివేశారు.
అయితే కొనుగోలుదారులు న్యాయపోరాటం చేశారు. అడ్డగోలు వాదనలు చేసిన వైసీపీ ప్రభుత్వం నిర్మాణాలను మాత్రం ప్రారంభించలేదు. చివరికి కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే కొనుగోలుదారులకు భరోసా ఇచ్చారు. పదేళ్లు ఆగిపోయినందున నిర్మాణ వ్యయం పెరిగినప్పటికీ.. అప్పట్లో కేటాయించిన ధరలకే ప్రాజెక్టు పూర్తి చేసిన కొనుగోలు దారులకు అందించనున్నారు. ఎన్సీసీ ఈ కాంట్రాక్ట్ పొందడంతో.. రెండేళ్లలలో హ్యాపీనెస్ట్ కొనుగోలుదారులందరికీ ఫ్లాట్ లభించే అవకాశాలు ఉన్నాయి.