ప్రేమ.. రెండక్షరాలే కాని దాని వలన కలిగే ఫీలింగ్ జీవితాంతం గుర్తుండిపోతుంది. అభిమానం, స్నేహం, ప్రేమ ఇవన్ని ఒకే వర్గానికి చెందినవైన కేవలం ప్రేమ అనేది ఎప్పటికి చాలా స్పెషల్ గా ఉంటుంది. ప్రేమంటే అర్ధం ఇది అని ఏ నిఘంటువు ఇవ్వలేకపోతుంది. సృష్టిలో డబ్బుతో పొందగలిగే అనుభూతులు ఎన్నున్నా.. స్వచ్చమైన ప్రేమకి మాత్రం లెక్క అనేది ఇప్పటికి తేలకుండా పోయింది.
ప్రేమలో పొందే అనుభూతిని మన రచయితలు ఎన్నో విధాలుగా వర్ణిస్తూ ఉంటారు.. ప్రేమ ఒక మైకం.. ప్రేమ ఒక పరవశం.. ప్రేమ అనే పదానికి ఎన్నెన్ని అర్ధాలొస్తాయో అన్నిటిని తమ పాటల్లో తెలియపరిచే ప్రయత్నం చేస్తారు. ప్రేమలో పొందే అనుభూతిని వ్యక్తపరిచే భాషే లేదంటే నమ్మాలేమో.. ఈరోజు జరుపుకుంటున్న ప్రేమికుల దినోత్సవం సందర్భంగా నిజమైన ప్రేమను ఆస్వాధించే ప్రేమికులందరికి తెలుగు360 తరుపున ప్రేమికుల దినోత్సవ శుభాకాంక్షలు. హ్యాపీ వాలెంటైన్స్ డే డియర్ రీడర్స్..!