అవును.. ప్రచారమే నిజమైంది. హార్దిక్ పాండ్యా- నటాషా స్టాంకోవిచ్ దంపతులు తమ వైవాహిక బంధానికి శుభం కార్డు వేశారు. తాము విడిపోతున్నట్లు సోషల్ మీడియా వేదికగా అనౌన్స్ చేశారు.
ఈ ఏడాది ఐపీఎల్ సీజన్ ముగింపు సమయంలోనే పాండ్యా- నటాషా దంపతులు విడిపోతున్నారని వార్తలు వచ్చాయి. సోషల్ మీడియాలో పాండ్యాతో కలిసి ఉన్న ఫోటోలతోపాటు పేరు పక్కన పాండ్య అనే సర్ నేమ్ ను నటాషా తొలగించడంతో ఈ ప్రచారానికి బలం చేకూరింది. ఈ నేపథ్యంలోనే నటాషా తన కుమారుడిని తీసుకొని సెర్బియాకు వెళ్ళడంతో విడాకులు ఖాయమని అంతా ఫిక్స్ అయ్యారు.
ఇటీవల విడాకుల విషయంలో పాండ్యా-నటాషా దంపతులు రాజీపడినట్లుగా కనిపించగా..ఇంతలోనే షాకింగ్ అనౌన్స్ మెంట్ చేశారు. తాము విడిపోతున్నట్లు ప్రకటించారు. నాలుగేళ్లు కలిసి జీవించామని.. ఇద్దరి జీవితాల గురించి ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నామని పేర్కొన్నారు. కుమారుడు అగస్త్య బాధ్యతను తల్లిదండ్రులుగా ఇద్దరం చూసుకుంటామని.. ఈ సమయంలో అభిమానుల మద్దతు ఉండాలంటూ పోస్ట్ చేశారు.