పవన్ కల్యాణ్ టీడీపీతో పొత్తు పెట్టుకుని ఎన్నికల్లో పోటీ చేయబోతున్నారన్న సమచారం బయటకు వచ్చినప్పటి నుంచి… తామే కాపు ప్రతినిధులం అన్నట్లుగా బిల్డప్ లు ఇచ్చిన ఇద్దరు పెద్దలు భయంకరమైన కోవర్ట్ ఆపరేషన్ ప్రారంభించినట్లుగా తాజా పరిణామాలు నిరూపిస్తున్నాయి. టీడీపీతో జనసేన పొత్తు కుదరకుండా.. కుదిరినా.. సరే సీట్ల పంపకాలు.. ఇతర అంశాల్లో లొల్లి పెట్టి సమన్వయంతో ముందుకెళ్లకుండా చేయడానికి.. జోగయ్య లేఖలతో చేసిన తాపత్రయం అంతా ఇంతా కాదు. నిజానికి జోగయ్య మంచం దిగలేని పరిస్థితుల్లో ఉన్నారు. ఆయన పేరుతో లేఖలు ఆయన రాస్తున్నారా లేకపోతే వైసీపీ ఆఫీసు నుంచి వస్తున్నాయా అన్నదానిపై స్పష్టత లేదు.
చివరికి పవన్ కల్యాణ్ డోంట్ కేర్ అనడంతో.. ఆయన కుమారుడు వైసీపీలో చేరిపోయారు. ఆయనకు ఏదో ఓ టిక్కెట్ ఇస్తున్నారు. ఇప్పుడు ముద్రగడ పద్మనాభం వంతు. ఆయన పవన్ కల్యాణ్ వారాహియాత్ర చేస్తే.. ఇష్టారీతిన సవాళ్లు చేసి పవన్ ను కించ పరిచారు. పవన్ ను ఇష్టం వచ్చినట్లుగా బూతులు తిట్టిన ద్వారంపూడినే తనకు చాలా ముఖ్యమన్నారు. తర్వాత హఠాత్తుగా.. వైసీపీతో తనకు పడని.. తాను టీడీపీ, జనేసనల్లో చేరుతానని చెప్పుకొచ్చారు. ఆ రెండు పార్టీలు ఆయనను దగ్గరకు రానీయకపోవడంతో… మళ్లీ ఆయన కూడా సీట్ల పంపకాల పేరుతో సలహాల లేఖలు ప్రారంభించారు. అదీ కూడా కాపు లెక్కలతో.
ఇప్పుడు ముద్రగడ కూడా వైసీపీలో చేరి నేరుగా పవన్ కల్యాణ్ పైనే పోటీ చేయబోతున్నారు. ఆయన ఎజెండా అందరికీ తెలిసిన విషయమే. నిజానికి ముద్రగడ వైసీపీకి సన్నిహితమని అందరికీ తెలుసు. తర్వాత ఎందుకు విబేధాలొచ్చాయో ఎవరికీ తెలియదు. కానీ పవన్ కల్యాణ్ పార్టీలో చేరి ఆయనను డీఫేమ్ చేయడానికి ఓ ప్రణాళిక ప్రకారం .. కోవర్ట్ ఆపరేషన్ చేయడానికి ప్లాన్ చేసుకున్నారని దాన్ని గమనించి.. పవన్ సైలెంట్ అయ్యారని అంటున్నారు. ఇప్పుడు పిఠాపురం నుంచి పవన్ పై వైసీపీ అభ్యర్థిగా పోటీ చేయడానికి రెడీ అవుతున్నారు. ఇప్పటికే అభ్యర్థిగా ప్రకటించిన వంగా గీత.. పవన్ పోటీ చేస్తే తాను పోటీ చేయలేనని చెప్పినట్లుగా తెలుస్తోంది.