ప్రముఖ సినీ రచయిత ఎంవీఎస్ హరనాద్ రావు గుండె పోటుతో మృతి చెందారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న హరనాద్ ఈ రోజు గుండెపోటుతో తుది శ్వాస విడిచారు.
ప్రతిఘటన, అమ్మాయికాపురం, స్వయంకృషి, సూత్రధారులు, యుద్దభూమి, దేశంలో దొంగలు పడ్డారు, మంచి దొంగ, ధర్మక్షేత్రం, భారతనారి వంటి పలు చిత్రాలకు కథ, మాటలు రాసిన ఎంవిఎస్.హరనాధరావు, స్వయంకృషి, సూత్రధారులు, ప్రతిఘటన సినిమాలకు ఉత్తమ రచయితగా నంది అవార్డులు అందుకున్నారు.
ప్రముఖ దర్శకుడు టి కృష్ణ ద్వారా ఇండస్ట్రీకి పరిచయమైన హరనాద్ రావు.. దాదాపు 100సినిమాలకు పైగా తన రచన సహకారం అందించారు. సినిమా పరిశ్రమకు రాకముందు ఆయన ప్రముఖ రంగస్థల నటుడు రచయిత కూడా. రక్తబలి. జగన్నాధ రధ చక్రాలు, యక్షగానం, ప్రజాకవి వేమన.. లాంటి పాపులర్ రంగస్థల నాటకాలను అదించారు. రాక్షసుడు, స్వయంకృషి సినిమాల్లో నటుడిగా కూడా కనిపించారు.
ఎంవీఎస్ హరనాద్ రావు మృతిపై పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు.