అల్లు అర్జున్ – హరీష్ శంకర్ కాంబినేషన్ లో ఓ సినిమా త్వరలోనే పట్టాలెక్కబోతోన్న సంగతి తెలిసిందే. ఈచిత్రానికి దిల్‌రాజు నిర్మాత. హరీష్ చెప్పిన కథ బన్నీకి నచ్చడం.. వెంటనే పచ్చజెండా ఊపడం.. టకటక జరిగిపోయాయి. అయితే… ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ఆసక్తికరమైన విషయం ఒకటి బయటకు వచ్చింది. అదేంటంటే.. బన్నీకి చెప్పిన కథ పవన్ కోసం రెడీ చేసుకొన్నదని టాక్. గబ్బర్ సింగ్ తరవాత పవన్ కల్యాణ్‌తో ఓ సినిమా చేయాలని హరీష్ గట్టిగా ప్రయత్నించాడు. దిల్‌రాజు హరీష్‌తో ఓ స్క్రిప్టు తయారు చేయించి.. పవన్ చుట్టూ తిరిగారు. అయితే పవన్ మాత్రం హరీష్‌కి ఛాన్స్ ఇవ్వలేదు.
ఇప్పుడు అదే కథని.. బన్నీకి చెప్పి ఒప్పించుకొన్నాడు హరీష్. బన్నీ స్టైల్ వేరు.. పవన్ స్టైల్ వేరు. కాబట్టి బన్నీకి తగ్గట్టు కథలో చిన్న చిన్న మార్పులు చేశాడట. ఒకవేళ బన్నీ సినిమా హిట్టయితే.. పవన్ ఓ హిట్ సినిమాని కాలదన్నుకొన్నట్టే. మరి పవన్ జడ్జిమెంట్ కరెక్టా? బన్నీది కరెక్టా? అనేది తెలియాలంటే ఈ సినిమా బయటకు రావాలి.