ప్రస్తుత డీజీపీ ద్వారకా తిరుమలరావు పదవి కాలం జనవరి నెలాఖరుతో ముగుస్తుంది. ఆయన రిటైర్ అవుతున్నారు. ఆయన స్థానంలో మాజీ డీజీపీ హరీష్ కుమార్ గుప్తాకు మళ్లీ బాధ్యతలు ఇవ్వనున్నారని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ద్వారకా తిరుమలరావు ప్రస్తుతం ఆర్టీసీ ఎండీగా కూడా ఉన్నారు. రిటైరైనప్పటికీ ఆయనకు ఆర్టీసీ ఎండీ పదవిని కొనసాగించే అవకాశాలు ఉన్నాయి.
హరీష్ కుమార్ గుప్తా కంటే మాదిరెడ్డి ప్రతాప్ రెడ్డి అనే ఐపీఎస్ సీనియర్ గా ఉన్నారు. కానీ వైఎస్ కుటుంబ భక్తుడు. జగన్ రెడ్డి హయాంలో కీలక పోస్టులు ఇస్తే ఆయన చేసిన రచ్చ చూసి వారు కూడా వదిలించుకున్నారు. కేసులు పెట్టారు. చివరికి ఇటీవలే ఆయన సీనియార్టీకి గౌరవం ఇచ్చి.. చంద్రబాబు ప్రభుత్వం ఆ కేసుల్ని ఉపసంహరించుకున్నారు. కానీ ఆయన పేరును డీజీపీ పోస్టుకు పరిశీలన చేసే అవకాశం లేదు. తర్వాత స్థానంలో హరీష్ కుమార్ గుప్తా ఉన్నారు.
గుప్తా ఎన్నికల సమయంలో డీజీపీగా ఉన్న రాజేంద్రనాథ్ రెడ్డిని ఈసీ బదిలీ చేయడంతో డీజీపీ అయ్యారు. ఆయనే కొనసాగారు కానీ.. ద్వారకా తిరుమలరావుకూ చాన్సివ్వాలన్న ఉద్దేశంతో తర్వాత ఆయనకు చాన్సిచ్చారు. ఇప్పుడు డీజీపీగా ద్వారకా తిరుమలరావు రిటైరవుతున్నారు. గుప్తాకు మళ్లీ డీజీపీ హోదా వస్తోంది. అలా సీనియర్ ఐపీఎల్ల గౌరవాన్ని చంద్రబాబు కాపాడుతున్నారు.
జగన్ హయాంలో సీనియార్టీలో పదిహేనో స్థానంలోఉన్న రాజేంద్రనాథ్ రెడ్డి, జవహర్ రెడ్డిలను మనోళ్లన్న కారణంగా డీజీపీ, సీఎస్‌లుగా నియమించి ఇతరుల్ని కించపరిచారు. ఇప్పుడు చంద్రబాబు సీనియార్టీకే ప్రాధాన్యం ఇస్తున్నారు.