” ఏపీలో పరిస్థితులు ఎలా ఉన్నాయో చూశారుగా..?..” ఓ రియల్ ఎస్టేట్ అవార్డు కార్యక్రమంలో .. తెలంగాణ మంత్రి హరీష్ రావు.. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఎంత బాగా వృద్ధి చెందడానికి అవకాశం ఉందో వివరిస్తూ అన్నమాట…! ఈ మాట అన్నవెంటనే.. ఎదురుగా ఉన్న రియల్టర్లు అందరూ భళ్లున నవ్వేశారు. హరీష్ రావు.. కాస్త వెటకారం ధ్వనిస్తూ.. నొసటితో నవ్వుతూ చేసిన వ్యాఖ్యలు.. అక్కడి పరిస్థితులు.. ఎంత మాత్రం పెట్టుబడులు పెట్టడానికి పనికి రావని… చెప్పినట్లయింది. అక్కడి ప్రభుత్వ నిర్ణయాలు.. రోజూ తెలుసుకుంటున్న రియల్టర్లకు.. హరీష్ రావు చెప్పిన విధానం చూసి.. నవ్వు ఆగలేకపోయింది. భళ్లున నవ్వేశారు. బుద్ధి ఉన్న వాళ్లు ఎవరైనా.. ఏపీలో పెట్టుబడులు పెట్టడానికి వెళ్తారా.. అన్నట్లుగా ఉన్నాయి.. వారి నవ్వులు..మాటలు.
అమరావతిని నిర్వీర్యం చేస్తే.. మొదటగా బాగుపడేది హైదరాబాదేనని…. ప్రతి ఒక్కరికీ తెలుసు. ఏపీలో ఉపాధి అవకాశాలు ఉన్న ఓ నగరాన్ని సృష్టించగలిగితే.. ముందుగా.. ఆ ఎఫెక్ట్ పడేది హైదరాబాద్ పైనే. అందుకే.. కేసీఆర్.. అమరావతి ప్రాజెక్ట్ పై మొదటి నుంచి నిరాశజకమైన వ్యాఖ్యలే చేస్తున్నారు. సన్నిహితులతో.. ఎన్నికలకు ముందు.. జగన్ వస్తే అమరావతి ఆపేస్తాడని.. దాని వల్ల హైదరాబాద్ రియాల్టీ.. అనూహ్యంగా పెరిగిపోతుందని.. వ్యాఖ్యానించినట్లుగా ప్రచారం జరిగింది. ఇప్పుడు.. జగన్ అమరావతిని నిలిపివేయడమే కాదు.. తన చిత్ర విచిత్ర నిర్ణయాలతో.. ఏపీకి పెట్టుబడులనేవి రాకుండా తరిమేస్తున్నారు. దాంతో అవన్నీ.. హైదరాబాద్ కు చేరుకుంటున్నాయి.
రూ. 70వేల కోట్ల ఆదాని డేటా సెంటర్ విశాఖ నుంచి తరలిపోయింది. దాన్ని హైదరాబాద్ ఒడిసి పట్టుకుంది. విశాఖలో లూలూ గ్రూప్ పెట్టాలనుకున్న పెట్టుబడులని కూడా జగన్ తరిమికొట్టేశారు. వాటిని కూడా హైదరాబాద్ అందిపుచ్చుకుంది. ఇప్పుడు ఏ మాత్రం నిర్మాణ కార్యక్రమాలు.. రియల్ ఎస్టేట్ వ్యాపారం సాగకుండా.. జగన్.. అమరావతి పీక పిసికేశారు. అందుకే.. హైదరాబాద్ రియల్టర్లకు.. పండగ లాంటి వాతావరణం వచ్చేసింది. ఏపీ కామెడీ అయిపోయింది.