మాజీ టీఆర్ఎస్ నెంబర్ టూ… ఇప్పుడు ఏ పొజిషన్లో ఉన్నారో కూడా.. తనకే అర్థం కాకుండా ఉన్న… హరీష్ రావు.. మెల్లగా అస్త్ర సన్యాసం చేస్తున్నారు. పార్టీలో ఎలాంటి బాధ్యతలు లేవు. ఎవరూ.. ఎలాంటి కార్యక్రమాలకూ పిలవడం లేదు. అందుకే.. ఆయన కొద్ది రోజులుగా.. తనకు మాత్రమే అధికారం ఉన్న .. సిద్ధిపేటలో మాత్రమే పర్యటిస్తున్నారు. మెల్లగా.. పార్టీ పరంగా… రాజకీయాల పరంగా.. తనపై ఉన్న బాధ్యతల్ని ఒక్కొక్కటిగా వదిలేస్తున్నారు. తాజాగా ఆయన .. తెలంగాణ మజ్దూర్ యూనియన్ గౌరవాధ్యక్ష పదవికి రాజీనామా చేశారు.
అధికార కార్యక్రమాలకు ఎక్కువ సమయం కేటాయించాల్సి రావడం వల్ల ఆర్టీసీ కార్మిక సంఘం కార్యక్రమాల్లో భాగస్వామ్యం సాధ్యపడటం లేదని అందుకే వైదొలుగుతున్నానని.. హరీష్ లేఖలో పేర్కొన్నారు. అయితే.. ఉద్యమం, పార్టీ, ప్రభుత్వ బాధ్యతల్లో తీరిక లేకుండా ఉన్నప్పుడే… గౌరవ అధ్యక్షునిగా ఉంది.. ఖాళీగా ఉన్నప్పుడు ఇప్పుడే ఎందుకు రాజీనామా చేశారన్నది చాలా మందికి అర్థం కాని విషయం.
అసలు టీఎంయూని పెట్టింది హరీష్ రావు. ఉద్యమ సమయంలో… ఆర్టీసీలోని తెలంగాణ ఉద్యోగులందర్నీ.. ఏకతాటిపైకి తెచ్చేందుకు..ఆ సంస్థలో గుర్తింపు సంఘంగా ఉన్న వాటిని .. చీల్చి.. మరీ తెలంగాణ మజ్దూర్ యూనియన్ను ప్రారంభించారు. సెంటిమెంట్‌తో తెలంగాణ ఉద్యోగులంతా..ఈ సంఘంలోకి వచ్చారు. ఈ సంఘాన్ని ఏకతాటిపైకి తీసుకు రావడంలో.. హరీష్‌దే కీలకపాత్ర. తెలంగాణలోని అన్ని డిపోల్లో ఈ సంఘాన్ని గెలిపించి.. గుర్తింపు సంఘంగా గుర్తింపు కూడా తెచ్చి పెట్టారు. ఉద్యమ సమయంలో.. ఆర్టీసీ సమ్మెను.. విజయవంతం చేయడంలో..ఈ సంఘం కీలకం. దీని వెనుక హరీష్ మాస్టర్ బ్రెయిన్. అయితే.. మారుతున్న రాజకీయంతో.. పాటే… ఇప్పుడు పరిస్థితులు కూడా మారిపోయాయి.
నిజానికి ఎన్నికలకు ముందు.. ఆర్టీసీలో సంక్షోభపరిస్థితులు ఏర్పడ్డాయి. టీఎంయూ ప్రధాన కార్యదర్శి అశ్వద్ధామరెడ్డి ప్రభుత్వంతో దాదాపుగా ఘర్షణకు దిగినంత పని చేశారు. దాంతో.. కేసీఆర్… ఆర్టీసీని ప్రైవేటు పరం చేస్తామని హెచ్చరించారు కూడా. ఆ సమయంలో.. టీఎంయూ గౌరవ అధ్యక్షునిగా ఉన్న హరీష్ రావు కల్పించుకోలేదు. హరీష్ రావే.. టీఎంయూ నేతల్ని రెచ్చగొట్టారని చెప్పుకున్నారు. కానీ.. కేటీఆర్ మాత్రం.. ఈ సమస్యను పరిష్కరించారు. కార్మికులకు సర్ది చెప్పారు. అప్పట్లో ఆ వివాదం సద్దుమణింగింది. ఆ తర్వాత ఎన్నికలొచ్చాయి.. వెళ్లాయి. ఇప్పుడు ఆ సంఘం నుంచి హరీష్ కూడా బయటకు వచ్చారు. ఇక హరీష్ తర్వాత దేనిని వదిలి పెట్టబోతున్నారో..!?