సీఎంఆర్ఎఫ్ చెక్కుల కేసు… హ‌రీష్ రావు ఆఫీస్ కీల‌క ప్ర‌క‌ట‌న‌

మాజీ మంత్రి హ‌రీష్ రావు పీఏ న‌రేష్ సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీలో చేతివాటం ప్ర‌ద‌ర్శించార‌ని, మ‌రో ముగ్గురితో క‌లిసి ఫేక్ అకౌంట్లు క్రియేట్ చేసి చెక్కులు డ్రా చేసుకున్నార‌న్న వార్త‌లు సంచ‌ల‌నంగా మారాయి. ఇప్ప‌టికే కేసు న‌మోదు కాగా, ముగ్గురు నిందితుల‌ను అరెస్ట్ చేశారు.

అయితే, ఈ కేసులో మంత్రి హ‌రీష్ రావు ఆఫీసులో ఇంకెవ‌రి ప్ర‌మేయం అయినా ఉందా? హ‌రీష్ రావును కూడా ఇరికిస్తారా…? అంటూ ర‌క‌ర‌కాలుగా చ‌ర్చ జ‌ర‌గుతున్న స‌మ‌యంలో హ‌రీష్ రావు ఆఫీస్ కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది.

న‌రేష్ అనే వ్య‌క్తి హ‌రీష్ రావు గారికి పీఏ కాద‌ని… ఔట్ సోర్సింగ్ ద్వారా ప‌నిచేస్తున్న కంప్యూట‌ర్ ఆప‌రేట‌ర్ అని వివ‌ర‌ణ ఇచ్చింది. ఈ విష‌యం త‌మ దృష్టికి వ‌చ్చినప్పుడే తాము కేసు న‌మోదు చేశామ‌ని, 17-12-2023నాడు తాము కూడా ఫిర్యాదు చేశామ‌ని…ఎన్నిక‌ల ఫ‌లితాలు రాగానే 06-12-2023నుండే ఆఫీసు నుండి మూసివేసిన‌ట్లు తెలిపింది. త‌ప్పుడు ప్రచారాలు న‌మ్మ‌వ‌ద్ద‌ని విజ్ఞ‌ప్తి చేసింది.

అస‌లు కేసు ఏంటీ?

హ‌రీష్ రావు మంత్రిగా ఉన్న స‌మ‌యంలో ఆయ‌న పేషీలో ఉండే న‌రేష్ అనే వ్య‌క్తి సీఎంఆర్ఎఫ్ చెక్కులు చూసేవారు. కానీ ఆ చెక్కులు ఇచ్చే స‌మ‌యంలో డ‌బ్బులు వ‌సూలు చేస్తార‌న్న ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి. వీడియోలు కూడా మీడియాలో వ‌చ్చాయి. తాజాగా ఫేక్ అకౌంట్లు క్రియేట్ చేసి ల‌బ్ధిదారుల‌కు రావాల్సిన మొత్తాన్ని తీసుకున్న‌ట్లు తేల‌టంతో కేసు న‌మోదైంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

డి-ఏజింగ్… లాభమా? నష్టమా ?

సినిమాలో ఒక క్యారెక్టర్ బాల్యం, యవ్వనం, కౌమార, ప్రౌడ దశలని చూపించడం ఫిల్మ్ మేకర్స్ కి పెద్ద సవాల్. ఇందుకోసం హలీవుడ్ నుంచి కూడా మేకప్ మ్యాన్ లని దిగుమతి చేసుకునే వారు....

దువ్వాడ శ్రీనివాస్ ఇంట్లో దివ్వెల మాధురీ !

దువ్వాడ ఫ్యామిలీ డ్రామాలో కొత్త కొత్త ఎపిసోడ్లు ప్రారంభమవుతున్నాయి. కొద్ది రోజుల పాటు సైలెంట్ గా ఉంటానని చెప్పిన దివ్వెల మాధురీ.. ఒక్క సారిగా.. ఏకంగా దువ్వాడ శ్రీనివాస్ ఇంట్లోనే ప్రత్యక్షమయ్యారు. దువ్వాడ...

ఆ పడవలు నందిగం సురేష్ తాలూకానే !

ప్రకాశం బ్యారేజీకి వరద వస్తే ఈ మధ్య బోట్లు కొట్టుకు వస్తున్నాయి. బ్యారేజని డ్యామేజ్ చేస్తున్నాయి. అవి ఎలా వస్తున్నాయో తెలియడం లేదు. ఇప్పుడు మిస్టరీ బయటపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. వైసీపీ రంగులేసిన...

శభాష్ నిమ్మల… అభినందించిన నారా లోకేష్

భారీ వర్షానికి తోడు బుడమేరకు పడిన గండ్లు విజయవాడను ముంచేత్తాయి. కనీవినీ ఎరుగని స్థాయిలో వరద పోటెత్తడంతో విజయవాడ గత ఆరు రోజులుగా వరదలో నానుతోంది. బుడమేరుకు పడిన గండ్లు పూడ్చితేనే విజయవాడకు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close