హైదరాబాద్: తెలంగాణ మంత్రివర్గ విస్తరణ జరుగుతుందని కొన్నిరోజులుగా మీడియాలో వార్తలొస్తున్న సంగతి తెలిసిందే. ఎట్టకేలకు ఆ వార్తలపై సందిగ్ధతను రాష్ట్ర భారీనీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు తొలగించారు. ఆ వార్తలు ఊహాగానాలేనని, అలాంటిదేమీ ఉండబోదని ఇవాళ మీడియా చిట్‌చాట్‌లో చెప్పారు. నామినేటెడ్ పోస్టుల భర్తీ దసరా తర్వాత ఉంటుందని తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీ సమావేశాల తర్వాత జిల్లాల పర్యటన ప్రారంభిస్తారని చెప్పారు. రేపు మిషన్ కాకతీయ, సంక్షేమ కార్యక్రమాలపై అసెంబ్లీలో చర్చ జరుగుతుందని వెల్లడించారు. నారాయణ్‌ఖేడ్ ఉపఎన్నికలో టీఆర్ఎస్ పోటీచేస్తుందని తెలిపారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే కృష్ణారెడ్డి మృతితో ఖాళీ అయిన ఈ స్థానానికి ఏకగ్రీవ ఎన్నిక చేద్దామని కాంగ్రెస్ పార్టీ విజ్ఞప్తి చేసిన సంగతి తెలిసిందే.