హైదరాబాద్: వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత జగన్మోహన్రెడ్డి తెలంగాణ నీటిపారుదలశాఖమంత్రి హరీష్‌రావుతో కలిసి ఓటుకు నోటు కేసుకు కుట్టచేశారంటూ ఏపీ అసెంబ్లీలో నిన్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, మంత్రి అచ్చెన్నాయుడు చేసిన ఆరోపణలపై హరీష్ రావు తీవ్రంగా స్పందించారు. జగన్మోహనరెడ్డిని తన జీవితంలో ఎన్నడూ కలవలేదని హరీష్‌రావు చెప్పారు. ఒకవేళ జగన్‌ను కలిసినట్లు నిరూపిస్తే రాజీనామాకు సిద్ధమని, లేకపోతే మీరు సిద్ధమా అంటూ చంద్రబాబునాయుడుకు సవాల్ విసిరారు. దమ్ము, ధైర్యం ఉంటే ఆధారాలను బయటపెట్టాలని డిమాండ్ చేశారు. చీకటి ఒప్పందాలు, చీకటి స్నేహాలు చేసుకోవాల్సిన అవసరం తనకు లేదని, ఆ చరిత్ర చంద్రబాబుకే ఉందని అన్నారు. ఓటుకు నోటు కేసులో పీకలదాకా కూరుకుపోయిన చంద్రబాబు మతిభ్రమించి మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు.
మరోవైపు హరీష్ రావు, జగన్, స్టీఫెన్సన్ మే 21న హోటల్లో కలుసుకున్నది వాస్తవమని మంత్రి అచ్చెన్నాయుడు మరోసారి చెప్పారు. హోటల్ సీసీ ఫుటేజిని తొలగింపజేశారని ఆరోపించారు. ఆ ముగ్గురూ కలుసుకున్నట్లు తమదగ్గర ఆధారాలున్నాయని మంత్రి ఇవాళ అసెంబ్లీలో మరోసారి చెప్పారు.
హరీష్-జగన్ భేటీపై ఆధారాలు బయటపెడతామని టీడీపీవారు దాదాపు రెండునెలలనుంచి చెబుతున్నారుగానీ, ఎందుకనో బయటపెట్టటంలేదు. ఆధారాలు ఉంటే అవి బయటపెట్టేస్తే ఒకపనయిపోతుందికదా!