హైదరాబాద్: వరంగల్ ఉపఎన్నిక, గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల ఫలితాల తర్వాత కేసీఆర్ వారసుడు కేటీఆరేనని ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే కేసీఆర్ మేనల్లుడు హరీష్ రావు ఆ ప్రచారాన్ని అంగీకరించటంలేదు. టీఆర్ఎస్ పార్టీలో నంబర్ 2 ఎవరూ లేరని ఇవాళ ఒక న్యూస్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించారు. కేసీఆర్‌కు ఇంకా 20 ఏళ్ళు పాలించే సామర్థ్యం ఉందని అన్నారు. కేసీఆర్‌తో తనకు విభేదాలు లేవని చెప్పారు. కేసీఆర్ పాలనలో అందరం కలిసి పనిచేస్తామని అన్నారు. నారాయణఖేడ్‌లో 50 వేల మెజారిటీతో గెలుస్తామని చెప్పారు. కాంగ్రెస్ పాలకులు ఇక్కడ ఫ్యాక్షన్ పాలన సాగించారని అన్నారు. టీడీపీకి డిపాజిట్ కూడా రాదని చెప్పారు.