భారత రాష్ట్ర సమితిలో క్రమంగా మార్పులు వస్తున్నాయి. కేటీఆర్ క్రమంగా సైడ్ అయ్యేలా వ్యవహారాలు జరుగుతున్నట్లుగా కనిపిస్తున్నాయి. హరీష్ రావు తెరపైకి వస్తున్నారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై ఫిర్యాదు చేయడానికి… పార్టీలో ఉన్న ఎమ్మెల్యేల ప్రోటోకాల్ కాపాడాలంటూ స్పీకర్ కు ఫిర్యాదు చేయడానికి వెళ్లిన బృందానికి కేటీఆరే నాయకత్వం వహించారు. కానీ డామినేషన్ మొత్తం హరీష్ రావుదే. బీఆర్ఎస్ఎల్పీ కార్యాలయంలో… బీఆర్ఎస్ఎల్పీ నేత చెయిర్ లో హరీష్ రావు కూర్చుని మాట్లాడారు. కేటీఆర్ పక్కన కూర్చున్నారు.
పార్టీ ఎమ్మెల్యేలు వీడిపోవడానికి కాంగ్రెస్ వైపు చూడటానికి కేటీఆర్ కూడా ఓ కారణం అన్ని ప్రచారం జోరుగా సాగుతుంది. ఆయన అహంకారమైన వ్యవహారశైలి వల్ల ఎమ్మెల్యేలకు సరైన గౌరవం లభించలేదనేది ఆ పార్టీలో ప్రధానంగా వినిపించే కంప్లైంట్. దానం నాగేందర్ ఇటీవల చేసిన వ్యాఖ్యలు సంచలనం అయ్యాయి. కేటీఆర్ తన కోటరిలో ఇతరుల్ని పెట్టుకుని దోచుకున్నారని.. ఎమ్మెల్యేలకు అపాయింట్మెంట్లు కూడా ఇచ్చేవారు కాదని.. కేసీఆర్ను కలిసే అవకాశం లేకుండా చేశారని… అవకాశం వచ్చాక ఇతర ఎమ్మెల్యేలు ఎందుకు ఉంటారని ప్రశ్నించారు.
బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు అటాచ్మెంట్ పెరగకపోవడానికి కూడా కారణం అదే. ఎక్కువ మంది ఫిరాయింపు ఎమ్మెల్యేలు ఉన్నప్పుడు వారితో కాస్త ఎమోషనల్ బాండింగ్ పెచుకుంటే.. కష్టాలు వచ్చినప్పుడు ఉండేవారు. కానీ పార్టీలో ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే అన్నట్లుగా ఉండటంతో పరిస్థితి మారుతోంది. పార్టీని వీడిపోతారన్నవారిపై కూడా పరుషమైన వ్యాఖ్యలు చేస్తూండటంతో పరిస్థితి మరింత దిగజారుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో కేటీఆర్ కన్నా హరీష్ రావునే ముందు పెట్టాలన్న డిమాండ్ అంతకంతకతూ పెరుగుతోంది. దానికి తగ్గట్లే హరీష్ … యాక్టివ్ పార్ట్ తీసుకుంటున్నారు