తెలంగాణ ఉద్యమం కోసం ఓ సారి రాజీనామా చేసినప్పుడు తన వెనుక రేవంత్ రెడ్డి నక్కి నక్కి ఉన్నాడని ఓ వీడియోను హరీష్ రావు సోషల్ మీడియాలో పోస్టు చేశారు. సీఎం హోదాలో ఉన్న రేవంత్ ను కించ పరిచేందుకు హరీష్ రావు ఈ పోస్టు చేశారని ఎవరికైనా అర్థమవుతుంది. కానీ అది రివర్స్ అవుతోంది. రేవంత్ అంత కింది స్థాయి నుంచి ఎదిగి సీఎం అయితే.. హరీష్ రావు మాత్రం.. ఇప్పుడు ఎక్కడ ఉన్నారన్న ప్రశ్నలు ఆ వీడియో చూసిన వారందరికీ వస్తున్నాయి.
https://x.com/BRSHarish/status/1818977273703506324
హరీష్ రావుకు తెలంగాణ ఉద్యమం ఆలంబనగా ఉంది. కానీ రేవంత్ రెడ్డి స్వయంకృషితో ఎదిగారు. జడ్పీటీసీ నుంచి… ఎమ్మెల్సీగా స్వతంత్ర అభ్యర్థిగా గెలిచారు. ఆయన తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పాటు చేసిన సమయంలో కేసీఆర్ వెంటే ఉన్నానని చాలా సార్లు చెప్పారు. పెద్దగా ఊపు లేని సమయంలో పార్టీ కోసం పని చేసినా గుర్తించలేదని కూడా రేవంత్ చెప్పారు. అయినా అప్పటి వీడియోలతో.. రేవంత్ ను కించ పరిచేందుకు హరీష్ వచ్చేశారు.
Also Read : రాజీనామాపై హరీష్ రావు యూ టర్న్!
కానీ హరీష్ రావు షేర్ చేసిన వీడియో చూస్తే.. రాజకీయాల్లో స్టామినా ముఖ్యమని.. అది రేవంత్ కు ఉందని నిరూపించినట్లయిందన్న అభిప్రాయానికి వస్తారు. రేవంత్ రెడ్డికి బ్యాక్ గ్రౌండ్ లేదు. హరీష్ రావు.. తన మేనమామ కేసీఆర్ ను పట్టుకుని రాజకీయాల్లోకి వచ్చారు. లేకపోతే హరీష్ రావు అసలు సర్పంచ్‌గా అయినా గెలిచి ఉంటారని చెప్పలేరు. కానీ రేవంత్ మాత్రం.. ఎవరి అండ లేకపోయినా ఇంకా .. ఆయనను ఎదగకుండా చేయాలని అనేక మంది ప్రయత్నించినా ఎదిగి ఇప్పుడు సీఎం పొజిషన్ లో ఉన్నారు. ఈ వీడియో ద్వారా.. హరీష్ రావు అదే సందేశం పంపారు.