కొన్నిసార్లు డైరక్టర్లకు షాక్ తగిలితే ఎలా ఉంటుందో ప్రత్యక్ష సాక్ష్యంగా నిలిచాడు హరీష్ శంకర్. వర్మ కాంపౌండ్ నుండి వచ్చిన ఈ దర్శకుడు రవితేజతో ‘షాక్’ అనే సినిమా తీశాడు. అయితే ఆ సినిమా కాన్సెప్ట్ మంచిదైనా ఆడియెన్స్ దాన్ని రిసీవ్ చేసుకోలేదని బాధపడ్డాడట. ఆ సినిమా ఇచ్చిన షాక్ లో నుండి తేరుకోడానికి తనకు 4 ఏళ్లు టైం పట్టిందని అన్నాడు హరీష్ శంకర్. ప్రేక్షకులకు తను షాక్ ఇద్దామనుకుంటే తనకే శాకం ఇచ్చారని స్టన్నింగ్ కామెంట్స్ చేశాడు. ఆ షాక్ ఇచ్చిన రివర్స్ షాక్ నుండి తేరుకుని మళ్లీ అదే రవితేజతో మిరపకాయ్ అంటూ వచ్చి మంచి కమర్షియల్ హిట్ కొట్టాడు డైరక్టర్ హరీష్.
ఇక ఆ జోష్ తోనే పవర్ స్టార్ పవన్ కళ్యాన్ గబ్బర్ సింగ్ ని తీసి రికార్డుల మోతమోగేలా చేశాడు. బేసిగ్గా పవన్ కళ్యాన్ ఫ్యాన్ అయిన హరీష్ ఆ సినిమాలో అడుగడునా పవర్ ని పాస్ చేస్తూ బాక్సాఫీస్ ని షేక్ చేశాడు. అయితే రీసెంట్ గా సుబ్రమణ్యం ఫర్ సేల్ సినిమా ప్రమోషన్లో భాగంగా ప్రేక్షకులు మంచి సినిమాలని ఆదరించరని షాకింగ్ కామెంట్స్ చేశాడు హరీష్ శంకర్.
కొసమెరుపుగా మేము ఎన్ని ప్రయోగాలు చేసినా ఎంత కష్టపడ్డా ఆడియెన్స్ ని ఎంటర్టైన్ చేయడమే, ప్రేక్షకులు ఇష్టపడే సినిమాలనే తీయడమే అంటూ కాస్త ఎమోషన్ అయ్యాడు హరీష్. ఆడియెన్స్ ని ఓ పక్క తిడుతూనే మళ్లీ వారికోసమే సినిమాలంటూ సముదాయించే ప్రయత్నం చేశాడు. మొత్తానికి రీసెంట్ గా రిలీజ్ అయిన సుబ్రమణ్యం ఫర్ సేల్ సినిమా అన్ని చోట్ల పాజిటివ్ టాక్ తో ముందుకు దూసుకెళ్తుంది.