ఓటీటీల హవా నడుస్తోంది. ఎంత పెద్ద నిర్మాత అయినా, దర్శకుడు అయినా, ఓటీటీలవైపు ఆకర్షితులు అవ్వాల్సిందే. ప్రస్తుతం దిల్ రాజుకూడా అటువైపే అడుగులేస్తున్నారు. టాలీవుడ్ లో అగ్ర నిర్మాతగా పేరొందిన దిల్ రాజు తొలిసారి… ఓ వెబ్ సిరీస్ నిర్మాణంలో భాగం పంచుకున్నారు. అదే.. `ఏటీఎమ్`. ప్రముఖ దర్శకుడు హరీష్ శంకర్ రాసిన కథ ఇది. ఓ ఏటీఎమ్ చోరీ నేపథ్యంలో సాగే కథ. ఈ కథని సినిమాగా చేయాలన్నది హరీష్ ఆలోచన. అయితే.. ఇప్పుడు వెబ్ సిరీస్ గా రూపాంతరం చెందింది. జీ 5 ఓటీటీ ఈ వెబ్ సిరీస్‌ని నిర్మించడానికి ముందుకొచ్చింది. హరీష్ – దిల్ రాజు.. ఇందులో భాగస్వాములు కానున్నారు. సి.చంద్రమోహన్ దర్శకత్వం వహిస్తారు. నటీనటుల ఎంపిక చేయాల్సివుంది. ఇందులో పేరున్న నటులే కనిపిస్తారని టాక్. ఈరోజు మధ్యాహ్నం ఈ వెబ్ సిరీస్‌కి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడనుంది.