మెగా కాంపౌండ్‌కి బాగా కావల్సిన దర్శకుల్లో హరీష్ శంకర్ ఒకడు. పవన్ కల్యాణ్‌తో గబ్బర్‌సింగ్ తీశాడు. అది కాస్త బ్లాక్ బస్టర్ హిట్టయిపోయింది. ఆ తరవాత కాలం కలసిరాలేదు. మళ్లీ మెగా హీరోనే ఆదుకొన్నాడు. ఈసారి సాయిధరమ్‌తేజ్‌తో సుబ్రమణ్యం ఫర్ సేల్ తీసి హిట్టుకొట్టాడు. అప్పటి నుంచీ హరీష్ ఖాళీనే. మధ్యలో మళ్లీ పవన్ కల్యాణ్‌కి కథ చెప్పి, ఒప్పించే ప్రయత్నాలు ముమ్మరంగా సాగాయి. ఈ దశలో దిల్‌రాజు కూడా హరీష్ కి అండగా నిలిచాడు. పవన్ కోసం కొన్ని కథలు సిద్దం చేయించాడు. అయితే.. పవన్ 2019 ఎన్నికల కోసం సినిమాల్ని త్యాగం చేయబోతున్న సంగతి తెలిసిందే. మరో రెండు మూడు సినిమాలకు మించి చేసే పరిస్థితి కనిపించడం లేదు. అందుకే.. ఇప్పుడు హరీష్ రూటు మార్చి బన్నీ కోసం ప్రయత్నాలు మొదలెట్టాడు.
మరోవైపు అల్లు అర్జున్ కీ హరీష్ శంకర్ అంటే గురి ఉంది. ఇద్దరూ కథ విషయంలో చాలాసార్లు చర్చించుకొన్నారు కూడా. ఇప్పుడు బన్నీతోనే ప్రయాణం సాగించాలని హరీష్ డిసైడ్ అయ్యాడట. ఈ చిత్రానికి దిల్‌రాజు నిర్మాతగా వ్యవహరించే అవకాశాలున్నాయి. ప్రస్తుతం లింగుస్వామి దర్శకత్వంలో తెరకెక్కనున్న చిత్రం కోసం సన్నద్దం అవుతున్నాడు బన్నీ. ఆ తరవాత విక్రమ్ కె.కుమార్‌తోనూ ఓ సినిమా చేయాల్సివుంది. మరి హరీష్‌కి టైమ్ ఎప్పుడిస్తాడో??