‘ఉస్తాద్ భగత్ సింగ్’ మధ్యలో బ్రేక్ వచ్చినా దాన్ని బాగా వాడుకొని, ‘మిస్టర్ బచ్చన్’ సినిమా పూర్తి చేసేశాడు హరీష్ శంకర్. ఇప్పుడు మళ్లీ ‘ఉస్తాద్..’ మొదలవ్వడానికి టైమ్ పడుతుంది. అందుకే ఈలోగా మరో ప్రాజెక్ట్ ఫినిష్ చేసే ప్రయత్నాల్లో ఉన్నాడు హరీష్. సితార ఎంటర్టైన్మెంట్స్ సంస్థలో హరీష్ ఓ సినిమా చేయడానికి అడ్వాన్సులు తీసుకొన్నాడని తెలుస్తోంది. హరీష్ తదుపరి సినిమా సితారతోనే. అయితే హీరో ఎవరన్నది ఇంకా తేలలేదు.
Read Also :మిస్టర్ బచ్చన్ ఓవర్ బడ్జెట్ అయ్యిందా?
హరీష్ నలుగురు హీరోలకు కథలు చెప్పాడు. చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, రామ్… వీళ్లతో టచ్‌లో ఉన్నాడు. చిరుకి కథ చెప్పి చాలా కాలమైంది. బాలయ్యకు ఓ లైన్ వినిపించాడు. వెంకటేష్‌కు ఫుల్ స్క్రిప్టు నేరేట్ చేశాడు. రామ్ తో సినిమా చేయబోతున్నానని ఎప్పుడో డిక్లేర్ చేశాడు. అయితే ఈ నలుగురు హీరోల్లో ఎవరు ముందు ‘ఓకే’ చెబుతారన్నది చూడాలి. బాలయ్య బాబీ సినిమా అయ్యాక `అఖండ 2` సెట్స్‌పైకి తీసుకెళ్తాడు. కాబట్టి.. ఆయనతో టైమ్ పడుతుంది. వెంకీతో సినిమా అంటే సంక్రాంతి వరకూ ఆగాలి. ఇక ఉన్న ఆప్షన్లు చిరు, రామ్ లే. ఒకవేళ ‘మిస్టర్ బచ్చన్’ హిట్టయితే వెంటనే వీరిద్దరూ పిలిచి మరీ సినిమా ఓకే చేసే పరిస్థితి కనిపిస్తోంది. ‘విశ్వంభర’ సంబంధించిన షూటింగ్ దాదాపుగా పూర్తయ్యింది. కాబట్టి చిరు పచ్చ జెండా ఊపు అవకాశాలు ఉన్నాయి. అయితే ఇవన్నీ తేలాలంటే కనీసం మరో నెల రోజులైనా టైమ్ పడుతుంది.