హరీష్ శంకర్ కి మాస్ పల్స్ బాగా తెలుసు. హీరోల్ని ఎలా చూపించాలో ఇంకా బాగా తెలుసు. తన టైటిళ్లు కూడా షార్ప్‌గా ఉంటాయి. ఇప్పుడు రవితేజతో కలిసి ఓ సినిమా చేస్తున్నాడు హరీష్ శంకర్. ఈ చిత్రానికి ‘మిస్టర్ బచ్చన్’ అనే క్యాచీ టైటిల్ పెట్టాడు. ‘నామ్ తో సునా హోగా’ అనేది క్యాప్షన్. రవితేజ అమితాబ్ కి వీర ఫ్యాన్. ఈ విషయాన్ని రవితేజ చాలా సందర్భాల్లో చెప్పాడు కూడా. ఇప్పుడు ఆ అభిమానాన్ని ఇలా చూపించుకొనే ఆస్కారం దక్కిందన్నమాట. బాలీవుడ్ లో ఘన విజయం సాధించిన ‘రైడ్’ చిత్రానికి ఇది రీమేక్. టీజీ విశ్వ ప్రసాద్ ఈ చిత్రానికి నిర్మాత. మిక్కీ జే.మేయర్ సంగీతాన్ని అందిస్తున్నారు. బాలీవుడ్ భామ భాగ్యశ్రీ బోర్సేని కథానాయిగా ఎంచుకొన్నారు. ఇప్పటికే హరీష్ – పవన్‌ల కాంబోలో ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సెట్స్‌పైకి వెళ్లింది. అయితే పవన్ రాజకీయాలతో బిజీగా ఉండి, సినిమాలకు బ్రేక్ ఇవ్వడంతో ఈ గ్యాప్‌లో రవితేజతో సినిమా పూర్తి చేయాలని హరీష్ రంగంలోకి దిగాడు.