సరైనోడు తరవాత అల్లు అర్జున్ సినిమా ఇంత వరకూ పట్టాలెక్కలేదు. లింగు స్వామి, విక్రమ్ కుమార్ లపేర్లు వినిపించాయి. విక్రమ్ కుమార్ కాస్త టైమ్ అడగడంతో లింగు స్వామి దర్శకుడిగా దాదాపుగా ఫైనల్ అనుకొన్నారు. అయితే సడన్ గా.. హరీష్ శంకర్ లైన్లోకి వచ్చాడు. రామయ్యా వస్తావయ్యా తరవాత పెద్ద హీరోలు హరీష్‌ని దాదాపుగా పక్కన పెట్టేశారు. దాంతో కొంత విరామం తీసుకొని సుబ్రమణ్యం ఫర్ సేల్ సినిమాని తీసి హిట్ కొట్టాడు. అయినా సరే.. స్టార్ హీరోలు హరీష్‌తో పనిచేయడానికి ముందుకు రాలేదు. ఆమధ్య పవన్‌తో సినిమా చేయాలని తెగ ట్రై చేసిన హరీష్.. ఆ తరవాత బన్నీ వెంట పడ్డాడు.
గత కొన్ని రోజులుగా బన్నీతో ట్రావెల్ అవుతున్నాడు హరీష్. బన్నీకీ హరీష్ తో ఓ సినిమా చేయాలనిపించింది.కాకపోతే లింగు స్వామికి ప్రామిస్ చేయడం వల్ల హరీష్ సినిమా విషయంలో డిసైడ్ కాలేకపోతున్నాడు. ఇప్పుడు లింగు స్వామి ఈ ప్రాజెక్టు నుంచి డ్రాప్ అయినట్టు టాక్స్ వినిపిస్తున్నాయి. లింగు స్వామితో సినిమా చేయడం కంటే హరీష్ తో లాగించేడయం బెటర్ అని బన్నీ భావిస్తున్నాడట. ఒక్కసారి స్క్రిప్టు ఫైనల్ నేరేషన్ విన్న తరవాత.. డిసైడ్ అవుతా అని బన్నీ… హరీష్‌కి ఆఫర్ ఇచ్చినట్టు తెలుస్తోంది. దాంతో హరీష్ శంకర్ స్క్రిప్టుని పూర్తి స్థాయిలో సిద్ధం చేసే ప్రయత్నాల్లో పడినట్టు టాక్. ఈవారంలోనే హరీష్ కథ చెప్పేస్తాడని, ఒకవేళ అన్ని విధాలా ఒకే అంటే వెంటనే ఈసినిమాని పట్టాలెక్కించేస్తారని టాక్.