క్రేజీ డైరక్టర్ హరీశ్ శంకర్ నిర్మాతగా మారనున్నట్టు ఫిల్మ్ నగర్ లో న్యూస్ చక్కర్లు కొడుతుంది. విలక్షణ నటుడు శర్వానంద్ నటించే తర్వాత సినిమాను యువి క్రియేషన్స్ తో పాటుగా ఆ చిత్ర నిర్మాణంలో దర్శకుడు హరీశ్ శంకర్ కూడా పాలు పంచుకోనున్నాడట. శంకరాభరణం సినిమాతో దర్శకుడిగా పరిచయమైన ఉదయ్ నందనవనం ఈ సినిమాకు దర్శకత్వం చేయబోతున్నాడట.
శంకరాభరణం ఫ్లాప్ అయినా టేకింగ్ పరంగా ఆ సినిమా పర్వాలేదనిపించుకుంది. అంతేకాదు శర్వానంద్ కు అదిరిపోయే కథ చెప్పి అతన్ని ఒప్పించాడట ఉదయ్. ఇక కథ విన్న హరీశ్ సినిమాకు నిర్మాణంలో తాను కూడా భాగస్వామ్యం అయ్యేలా ప్రయత్నాలు చేస్తున్నాడట. సో దర్శకుడి అభిరుచికి నచ్చి మరి నిర్మాతగా మారుతున్నాడు అంటే కచ్చితంగా సినిమాలో మంచి విశేషమే ఉండి ఉంటుంది. మరి ప్రయోగాలకు ఎప్పుడు ముందు ఉండే శర్వా ఈ సినిమాతో ఎలాంటి ఫలితాన్ని అందుకుంటాడో. సినిమాకు సంబందించిన మిగతా కాస్ట్ అండ్ క్రూ త్వరలో వెళ్లడయ్యే అవకాశాలు ఉన్నాయి. మరి దర్శకుడిగా ఎలాగు సరైన అవకాశాలు రావట్లేదని ముందు జాగ్రత్తగా నిర్మాతగా అనుభవం సాధించే పనిలో ఉన్నాడు హరీష్ శంకర్.. శర్వానంద్ తో చేసే ఈ మొదటి ప్రయత్నం ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాలి.