పవన్ కళ్యాణ్ తో హరీష్ శంకర్ ఒక సినిమా చెయ్యాలి. కానీ అది ఎంతకీ పట్టాలు ఎక్కడం లేదు. దాంతో హరీష్ మరో ఆప్షన్ చూసుకుసుంటున్నాడు. అందులో భాగంగా విజయ్ దేవరకొండ తో ఒక సినిమా చేసేందుకు రెడీ అయ్యాడు. ఈ క్రమంలో హరీష్.. విజయ్ ని కలిశాడని, ఒక కథ కూడా చెప్పాడని, ఐతే ఆ కథ నచ్చక విజయ్ తిరస్కరించాడని ఒక గాసిప్ వెబ్ సైట్ వార్త వండి వార్చింది. కానీ అసలు విషయం ఏమిటంటే… ఇప్పటి వరకూ విజయ్ కి హరీష్ కథ చెప్పిందే లేదు.
విజయ్ కి కథ చెప్పడానికి హరీష్ కొంత సమయం అడిగాడు. వారం పది రోజుల్లో… ఒక మీటింగ్ ఉంటుంది. ఆ తరవాత ఈ కాంబో భవిష్యత్ ఏమిటో తెలుస్తుంది. ఈ కాంబో కనుక సెట్ ఐతే.. ఈ సినిమా మైత్రీ మూవీస్ లోనే ఉంటుంది. ఎందుకంటే పవన్ సినిమా కోసం మైత్రీ దగ్గర హరీష్ అడ్వాన్స్ తీసుకున్నాడు. దానికి న్యాయం చెయ్యాలి. ఈ సినిమాలో జనగణమన నిర్మాతలూ భాగస్వాములుగా వుంటారు. ఎందుకంటే పూరి తో విజయ్ చేయాల్సిన ఆ సినిమా కూడా ఆగిపోయింది కనుక… ఆ నిర్మాతలకు విజయ్ ఒక సినిమా బాకీ వున్నాడు.