భారత మహిళా క్రికెటర్ హర్లీన్ డియోల్ నిన్నటి మ్యాచ్ లో పట్టుకున్న క్యాచ్ సంచలనంగా మారగా, అందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇప్పటివరకు మహిళా క్రికెట్ చరిత్రలో ఇదే బెస్ట్ క్యాచ్ అంటూ పలువురు ప్రముఖులు ఆమె పై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. వివరాల్లోకి వెళితే..
భారత మహిళా క్రికెట్ జట్టు కి ఇంగ్లాండ్ జట్టుకు మధ్య నిన్న జరిగిన మ్యాచ్ లో భారత క్రికెటర్ హర్లీన్ డియోల్ అద్భుతమైన క్యాచ్ పట్టుకున్నారు. ఇంగ్లాండ్ మహిళా క్రికెటర్ అమీ ఎల్లెన్ జోన్స్ బౌండరీ దాటించేలా కొట్టిన బంతిని బౌండరీ లైన్ వద్ద హర్లీన్ డియోల్ క్యాచ్ పట్టిన తీరు ప్రేక్షకులని మెస్మరైజ్ చేసింది. పెవిలియన్ లో కూర్చున్న ఇంగ్లాండ్ క్రీడాకారులు సైతం లేచి నిలబడి ఆ క్యాచ్ కి చప్పట్లు కొట్టారు. ఇంగ్లాండ్ బ్యాట్ విమెన్ ఎమీ ని 43 పరుగుల వద్ద ఈ క్యాచ్ తో అవుట్ చేయడం ద్వారా ఆమె హాఫ్ సెంచరీ చేరుకోకుండా అడ్డుకుంది హర్లీన్.
అయితే ఈ మ్యాచ్ లో భారత్ విజయం సాధించలేదు. ఇంగ్లాండ్ 20 ఓవర్లలో 177 పరుగులు చేయగా, భారత్ 9 ఓవర్లలో 54 పరుగులు చేసిన సమయంలో వర్షం కారణంగా ఆట ఆగిపోయింది. ఆ తర్వాత మాట కొనసాగించడానికి వీలు పడకపోవడంతో DLS పద్ధతి లో ఇంగ్లాండ్ విజేతగా ప్రకటించబడింది. అయినప్పటికీ ఈ మ్యాచ్ లో డియోల్ పట్టిన క్యాచ్ హైలెట్ గా నిలిచి పోయింది.
Nope. Not possible. Couldn’t have happened. Must be some special effects trick. What? It was real? Ok, move over Gal Gadot; the real WonderWoman is here… pic.twitter.com/Cr9STZrVnW
— anand mahindra (@anandmahindra) July 10, 2021
As good a catch one will ever see on a cricket field, from Harleen Deol. Absolutely top class. https://t.co/CKmB3uZ7OH
— VVS Laxman (@VVSLaxman281) July 10, 2021
భారత క్రికెటర్లతో పాటు, ఆనంద్ మహీంద్రా వంటి వ్యాపారాధినేతలు సైతం ఈ క్యాచ్ ని పట్టుకున్న హర్లీన్ డియోల్ పై ప్రశంసల జల్లు కురిపించారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఆమె క్యాచ్ కి సంబంధించిన వీడియో తెగ చక్కెర్లు కొడుతోంది.