దేశవ్యాప్తంగా ఆసక్తి రేకెత్తించిన హర్యానా, జమ్మూకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అంచనాలు వేసినట్లుగానే గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటోంది. హర్యానాలో పదేళ్ల అధికార వ్యతిరేకత బీజేపీని గట్టి దెబ్బకొట్టింది. కాంగ్రెస్ పార్టీకి ఏకపక్ష. విజయం అక్కడ లభించడం ఖాయంగా కనిపిస్తోంది. మొత్తం 90 స్థానాలు ఉన్న అసెంబ్లీలో కాంగ్రెస్కు 55 సీట్లవరకూ వస్తాయని ట్రెండ్స్ సూచిస్తున్నాయి. ఇక్కడ బీజేపీ మొదటి రౌండ్లలోనే పరాజయాన్ని అంగీకరించినట్లు అయింది.
ఇక అత్యంత కీలకమైన జమ్మూకశ్మీర్లో హంగ్ ఏర్పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. 90 స్థానాలు ఉన్న జమ్మూ కశ్మీర్లో ఫరూక్ అబ్దుల్లా నేతృత్వంలోని నేషనల్ కాన్ఫరెన్స్ అతి పెద్ద పార్టీగా అవతరించనుంది. ఆ పార్టీ మిత్రపక్షం కాంగ్రెస్తో కలిసి 40కిపైగా స్థానాలను గెలుచుకోనుంది. కానీ ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన 46 సీట్లకు కాస్తదూరంలో ఆగిపోయే సూచనలు కనిపిస్తున్నాయి. ప్రాథమిక ట్రెండ్స్ ప్రకారం బీజేపీ రెండో అతి పెద్ద పార్టీగా ఉంటుంది . పది మందికిపైగా ఇండిపెండెంట్లు, ఐదుగురు వరకూ మొహబూబా ముఫ్తీ పార్టీ కి చెందిన వారు లీడ్ లో ఉన్నారు.
కాంగ్రెస్ – నేషనల్ కాన్ఫరెన్స్ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే నలుగురైదుగురు ఇండిపెండెంట్లు మద్దతు ఇస్తే చాలు. కానీ బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే ఇండిపెండెంట్లతో పాటు పీడీీ సపోర్టు తీసుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుత ట్రెండ్స్ ప్రకారం చూస్తే కశ్మీ ర్ లో ప్రభుత్వం కూడా బీజేపీ చేజారినట్లే అనుకోవచ్చు. మొత్తంగా బీజేపీకి షాకిచ్చేలా ఫలితాలు వస్తున్నాయి.